Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైమండ్ ప్రిన్స్ నౌకలోని కరోనా వైరస్ బాధితులకు యాపిల్ ఐఫోన్లు.. ఎందుకు? (Video)

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (14:57 IST)
జపాన్‌కు చెందిన పర్యాటక నౌక డైమండ్ ప్రిన్సెస్ నౌకలో కరోనా వైరస్ బారినపడిన 3700 మంది బాధితులకు యాపిల్ ఐఫోన్లను పంపిణీ చేశారు. ఇదే విషయంపై ఎన్డీటీవీ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ నౌకలో ఉన్న కరోనా వైరస్ బాధితుల్లో భారతీయులు కూడా ఉన్నారు. ఈ బాధితుల్లో రెండు వేల మందికి యాపిల్ ఐఫోన్లను అందచేశారు. 
 
వైద్య నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు, అపాయింట్మెంట్లను బుక్ చేసుకునేందుకు, మందుల వాడకం, ఇతర అంశాలపై వైద్యులతో మాట్లాడేందుకు వీలుగా ఈ ఫోన్లను పంపిణీ చేశారు. కాగా, ఈ నౌకలో ఉన్నవారిలో దాదాపు 350 మందికి ఈ వైరస్ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలిన విషయం తెల్సిందే.
 
మరోవైపు, కరోనా వైరస్ దెబ్బకు చైనా కకావికలమైపోతోంది. ఈ వైరస్ రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. ఫలితంగా మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 1770కు చేరింది. హుబే ప్రావిన్స్‌లో ఒక్క రోజులోనే 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
అదేసమయంలో చైనాలో కొత్తగా 2018 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కోవిద్‌-19 వైరస్‌ బాధితుల సంఖ్య 70,548కి చేరింది. ఈ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరికోలుకున్న తర్వాత 10,844 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు చైనా అధికారులు బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు విధించారు. 
 
మరోవైపు, పాన్‌ తీరంలో నిలిపేసిన 'డైమండ్‌ ప్రిన్సెస్' నౌకలో కోవిడ్-19 సోకిన వారి సంఖ్య ఆదివారానికి 355కి పెరిగింది. అందులోభారత్‌ సహా 50 దేశాలకు చెందిన 3700 మంది ఉన్నారు. ఆ నౌకలో నుంచి తమ వారిని తీసుకువెళ్లేందుకు అమెరికా, కెనడా సహా పలు దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments