డైమండ్ ప్రిన్సెస్‌లో నౌకలో ఉన్న భారతీయులు అంతేనా.. కేంద్ర మంత్రి ఏమన్నారు?

శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:34 IST)
జపాన్ విహార నౌక అయిన డైమండ్ ప్రిన్సెస్‌లో ఉన్న పర్యాటకుల్లో కరోనా వైరస్ బారినపడివారిలో భారతీయులు కూడా ఉన్నారు. ఈ నౌకను జపాన్ ప్రభుత్వం నిర్భంధంలో ఉంచింది. అయితే, ఈ నౌకలో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే అవకాశంలేదని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
 
కొవిడ్ -19 వైరస్ సోకిన నేపథ్యంలో జపాన్ విహార నౌక అయిన డైమండ్ ప్రిన్సెస్‌ను టోక్యో తీరంలోని యోకహామా వద్ద సముద్రంలోనే జపాన్ ప్రభుత్వం నిర్బంధించింది. ఈ నౌకలో 3,711 మంది ఉండగా, వీరిలో 138 మంది భారతీయులు ఉన్నారు. డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో ఉన్న ఇద్దరు భారతీయులకు కొవిడ్ -19 వైరస్ సోకిందని, వారికి నౌకలోనే చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. 
 
అయితే, కొవిడ్-19 వైరస్ నివారించేందుకు జపాన్ దేశం విహారనౌకలో 138 మంది భారతీయులను నిర్బంధించినందున వారిని బయటకు తీసుకురాలేమని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అయితే, నౌకలోని భారతీయుల గురించి తమ రాయబార కార్యాలయం జపాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని కేంద్ర మంత్రులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సంగారెడ్డి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్