Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంఫాన్ తుఫాన్ బీభత్సం.. బెంగాల్‌లో 12మంది మృతి

Webdunia
గురువారం, 21 మే 2020 (12:10 IST)
అంఫాన్ తుఫాన్ బెంగాల్‌లో బీభత్సం సృష్టిస్తోంది. బెంగాల్ తీరాన్ని తాకిన అంఫాన్ తుఫాన్ కారణంగా ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. బలమైన ఈదురుగాలులు, వర్షాలకు.. వేలాది ఇండ్లు ధ్వంసం అయ్యాయి. 
 
కరోనా వైరస్ ఆంక్షల నేపథ్యంలో.. సహాయక చర్యలు అంతంతగానే సాగుతున్నాయి. బెంగాల్ తీరం వద్ద సుమారు గంటలకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అతి తీవ్ర తుఫాన్‌గా మారిన అంఫాన్‌.. రానున్న మూడు గంటల్లో అల్పపీడనంగా మారనున్నట్లు ఐఎండీ అధికారి తెలిపారు. 
 
బెంగాల్ నుంచి ఈశాన్య దిశగా బంగ్లాదేశ్ వైపు తుఫాన్ ప్రయాణిస్తున్నది. సుమారు గంటలకు 30 కిలోమీటర్ల వేగంతో అంఫాన్ ప్రయాణిస్తున్నట్లు ఐఎండీ చెప్పింది. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
 
కరోనా వైరస్ కన్నా అంఫాన్ తుఫాన్ ప్రభావమే ఎక్కువగా ఉన్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అంఫాన్ నష్టం సుమారు లక్ష కోట్ల వరకు ఉంటుందని ఆమె అంచనా వేశారు. దాదాపు అయిదు లక్షల మందిని షెల్టర్ హోమ్‌లకు తరలించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments