Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టగొడుగుల పలావ్ ఇలా చేస్తే లొట్టలేసుకుని తినాల్సిందే...

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (19:17 IST)
ఆదివారం వస్తే మాంసాహార ప్రియులు చాలా రకాల మాంసాహారాలుంటాయి. కానీ శాఖాహారులు ఎప్పుడు తినే కూరగాయలే కదా అని అనుకోవద్దు. మాంసాహారం కన్నా కూడా శాఖాహారంతో అద్భుతమైన రుచితో మనం వంటలు చేసుకోవచ్చు. పుట్టగొడుగులతో పలావు చేసుకుంటే రుచి అదిరిపోతుంది. శాఖాహారులకు పుట్టగొడుగులతో పలావు ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు :
బాస్మతి బియ్యం- పావుకేజి,
పుట్టగొడుగులు- పావుకేజి,
నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు,
నూనె- మూడు టేబుల్ స్పూన్లు,
ఉల్లిపాయ- ఒకటి,
పచ్చిమిర్చి- రెండు,
టమోటా- ఒకటి,
అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టేబుల్ స్పూను,
పలావు మసాలా- ఒక టేబుల్ స్పూను,
పెరుగు- పావు కప్పు,
పలావు దినుసులు-తగినన్ని, 
కొత్తిమీర, పుదీనా- తగినంత,
ఉప్పు- సరిపడా,
 
తయారుచేయు విధానం:
ఒక గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడి చెయ్యాలి. నూనె వేడయ్యాక పలావు దినుసులు వేసి దోరగా వేయించాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. తువాత అల్లంవెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. దానిలో పలావు మసాలా, పెరుగు, పుట్టగొడుగులు వేసి అయిదు నిమిషాలు వేగాక తగినన్ని నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేయాలి. నీళ్లు తెర్లేటప్పుడు బియ్యం వేయాలి. అన్నం ఉడకడం మొదలవగానే చిన్న మంటపై ఉంచి పూర్తిగా ఉడికినాక స్టవ్ ఆపెయ్యాలి. ఎంతో ఘుమఘుమలాడే పుట్టగొడుగుల బిర్యాని రెడీ. దీనిని కుర్మాతో తింటే టేస్టీగా వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

మనిషి మర్చిపోవడం సహజం.. కానీ ఎవరైతే అన్నం పెట్టారో : డిప్యూ సీఎం పవన్ (Video)

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

తర్వాతి కథనం
Show comments