మామిడి పులిహోర.. ఎలా చేయాలో తెలుసా?

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (21:27 IST)
సాధారణంగా మనం చింతపండు, నిమ్మకాయలతో పులిహోర చేసుకుంటూ ఉంటాం. కేవలం ఇవే కాకుండా మామిడి తురుముతో కూడా పులిహోర తయారుచేసుకోవచ్చు. ఇది తినటానికి రుచిగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో సి విటమిన్
పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు...
బియ్యం- పావుకిలో
మామిడికాయ తురుము- కప్పు
పసుపు- పావు టీ స్పూను
ఉప్పు- తగినంత
నూనె -2 టేబుల్ స్పూన్లు
ఆవాలు- టీ స్పూన్
శెనగపప్పు- టేబుల్ స్పూన్
మినపప్పు- టేబుల్ స్పూన్
ఎండుమిర్చి- 4
ఇంగువ- చిటికెడు
పచ్చిమిర్చి-4
పల్లీలు- పావుకప్పు
కరివేపాకు- 2 రెబ్బలు
 
తయారుచేసే విధానం..
బియ్యం ఉడికించి ప్లేటులో ఆరనివ్వాలి. టీ స్పూన్ నూనెలో పసుపు వేసి కలపాలి. విడిగా ఓ బాణాలిలో నూనె వేసి శెనగపప్పు, మినపప్పు,ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, ఆవాలు వేసి వేయించి పోపు చేయాలి. అవి వేగాక పల్లీలు, పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. అందులోనే మామిడికాయ తురుము వేసి కలిపి వెంటనే దించేసి అన్నం మిశ్రమంలో కలిపితే మామిడికాయ పులిహోర రెడీ.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌పై యుద్ధ లక్ష్యాలు ముగిశాయి.. ఇంకా సాధించాల్సిందేముంది? ఆస్ట్రేలియా

జైపూర్‌లో ప్రాణం తీసిన పార్కింగ్ గొడవ (వీడియో వైరల్)

ఏప్రిల్ నుండి జూన్ వరకు తీవ్రమైన వడగాల్పులు.. ఐఎండీ హెచ్చరిక

మూడోసారి గర్భందాల్చిన మహిళ.. ఈత కొలనులో శవాలై తేలిన తల్లీకూతుళ్లు

రఘురామ కృష్ణంరాజుపై విచారణ ప్రారంభించాలి.. రాష్ట్రపతి కార్యాలయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ranbir Kapoor: వీరులు పుట్టకముందే… రామ ఉన్నాడు..

చిరంజీవి ఇంటి పూజా మందిరంలోని ఆంజనేయుడుని తాకిన సూర్యకిరణాలు (వీడియో)

విజయ్ ఆంటోని వంద దేవుళ్లు చిత్రం నుంచి మెలోడీ గీతం విడుదల

Faria Abdullah: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా గాయపడ సింహం నుంచి బ్రైడ్ సాంగ్

సై ఫై థ్రిల్లర్ మూవీ కిల్లర్ నుంచి డా. పూర్వజ్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments