కావలసిన పదార్థాలు:
వెన్న - 75 గ్రా
మైదా 75 గ్రా
నీళ్లు - 75 గ్రా
తాజా క్రీమ్ - 200 గ్రా
గుడ్లు - 7
చాకొలేట్ పౌడర్ - 100 గ్రా
ఐసింగ్ షుగర్ - 150 గ్రా
తయారీ విధానం:
ముందుగా వెన్న, నీళ్లని కలిపి ఒక పాన్‌లో వేడిచేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మైదా, మూడు గుడ్ల మిశ్రమాన్ని పోసి బాగా కలుపుతూ ముద్దలా చేయాలి. ఈ ముద్దని పేస్ట్రీలా చిన్న చిన్న భాగాలుగా చేసి బట్టర్ పేపర్‌లో పెట్టాలి. దీనిని ఒవెన్‌లో పెట్టి చాకొలేట్ కలర్‌లోకి వచ్చేవరకు 20 నిమిషాల పాటు ఉంచాలి.
ఇప్పుడు తాజా క్రీములో 50 గ్రా, ఐసింగ్ షుగర్ వేసి కలిపి బాగా గిలక్కొట్టాలి. దీనిని ఒవెన్ నుండి తీసిన పేస్ట్రీస్ (ఎక్లేర్స్)లో ఇంకేలా జాగ్రత్తగా వాటిపే పోయాలి. ఆ తరువాత 100 గ్రా ఐసింగ్ షుగర్, చాకోలేట్ పౌడర్‌లలో నాలుగు గుడ్లలోని తెల్లసొనను వేసి బాగా కలుపుకోవాలి. ఎక్లేర్స్ పైన ఈ చాకొలేట్ ఐసింగ్‌ని ఒక పొరలాగా వేసి పైన ఐసింగ్ క్రీమ్‌తో అలంకరించాలి. అంతే చాకోలేట్ ఎక్లేర్స్ రెడీ.