Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెల్లుల్లితో మ్యాగీ నూడుల్స్...?

Advertiesment
వెల్లుల్లితో మ్యాగీ నూడుల్స్...?
, గురువారం, 10 జనవరి 2019 (11:25 IST)
కావలసిన పదార్థాలు:
మ్యాగీ నూడుల్స్ - 4 ప్యాకెట్స్
వెల్లుల్లి రెబ్బలు - 10 
తరిగిన ఉల్లిపాయలు - 1 కప్పు
గుడ్లు - 3
పచ్చిమిర్చి - 1
అల్లం తురుము - 1 స్పూన్
ఉప్పు - కొద్దిగా
కారం - 1 స్పూన్
చిల్లీసాస్ - 1 స్పూన్
నూనె - ఒకటిన్నర స్పూన్
నూనె - 2 స్పూన్స్.
 
తయారీ విధానం:
ముందుగా మ్యాగీ నూడుల్స్‌ను ఉడికించుకోవాలి. ఇప్పుడు బాణలిలో గుడ్లు పగలకొట్టి అందులో ఉప్పు, కారం, అల్లం తురుము వేసి 2 నిమిషాల పాటు నూనెలో వేయించుకోవాలి. మరో బాణలిలో నూనె వేసి వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా వేయించి.. ఆ తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిల్లీసాస్ వేసి మరో 2 నిమిషాలు వేయించాలి. ఆ తరువాత గుడ్ల మిశ్రమం, మ్యాగీ నూడుల్స్ కూడా వేసి చిన్న మంటపై 3 నిమిషాల పాటు వేగించి తీసుకుంటే.. టేస్టీ టేస్టీ వెల్లుల్లి మ్యాగీ నూడుల్స్ రెడీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుదీనా పచ్చడి చేస్తున్నారా..?