Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సీజన్‌లో ఈ ఒక్క కాయ తింటే 100 రోగాలు దరిచేరవు..

దానిమ్మ కాయ గురించి తెలియని వారు ఎవరుండరు చెప్పండి. ఎర్రటి గింజలతో చూడగానే నోరూరించే దానిమ్మ కాయలో ఎన్ని ఔషధ గుణాలున్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. దానిమ్మ కాయ రసాన్ని ప్రతిరోజు రెండు స్పూన్ల చొ

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (16:06 IST)
దానిమ్మ కాయ గురించి తెలియని వారు ఎవరుండరు చెప్పండి. ఎర్రటి గింజలతో చూడగానే నోరూరించే దానిమ్మ కాయలో ఎన్ని ఔషధ గుణాలున్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. దానిమ్మ కాయ రసాన్ని ప్రతిరోజు రెండు స్పూన్ల చొప్పున మూడుసార్లు తీసుకుంటే మొలల వలన కలిగే రక్తస్రావాన్ని తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే దానిమ్మ పండు పైన ఉన్న బెరడును పదిగ్రాములు తీసుకుని దాన్ని కషాయంగా కాచి తాగితే విరోచనాల నుంచి విముక్తి కలుగుతుందట.
 
అలాగే కడుపులో ఉండే బద్దె పురుగుల నుంచి ఉపశమనం పొందాలంటే దానిమ్మ వేరు ఎంతగానో ఉపయోగపడుతుంది. దానిమ్మ వేరు పొట్టును 50 గ్రాములు తీసుకుని దానికి నాలుగు రెట్ల నీళ్ళు పోసి పంచదార, తేనె లేక ఆముదం కొంచెం కలిపి రెండు స్పూన్ల మూడు పూట్ల తీసుకుంటే బద్దె పురుగులు మనలో నుంచి పారద్రోలవచ్చట. 
 
దానిమ్మ ఆకుల చూర్ణాన్ని, చందన చూర్ణం, తేనెతో కలిసి పెరుగుతో తీసుకుంటే గర్భస్రావాన్ని నివారించవచ్చట. అలాగే నోటి పూతను నివారించవచ్చడానికి దానిమ్మ గింజలు ఔషధంలా పనిచేస్తాయట. ఈ గింజెలకు అల్సర్‌ను నివారించే గుణం ఉంటుందట. గింజలను తినడం వల్ల ఆడవారు నెలసరి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చట. ప్రతిరోజు క్రమం తప్పకుండా దానిమ్మ గింజలను తింటే క్యాన్సర్ బారి నుంచి గట్టెక్కవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments