Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరక్కాయను పగులగొట్టి చిన్న ముక్కను బుగ్గన ఉంచుకుంటే...

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (21:46 IST)
చలికాలంలో చల్లదనానికి దగ్గు ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా ఆస్త్మా ఉన్నవారికి ఆయాసం, దగ్గు సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది.  ఒక్కోసారి ఎన్ని మందులు వాడినా ఆ సమస్య అలానే ఉంటుంది. దగ్గు నుండి ఉపశమనం  పొందాలంటే మన ఇంట్లో లభించే కొన్ని పదార్దాలతోనే మనం ఔషదాన్ని తయారుచేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. కరక్కాయను పగులగొట్టి చిన్న ముక్కను బుగ్గన ఉంచుకుని చప్పరిస్తూ ఆ రసాన్ని కొద్ది కొద్దిగా మింగుతూ ఉంటే సాధారణంగా వచ్చే దగ్గు తగ్గిపోతుంది. చేదుగా, వగరుగా ఉండే కరక్కాయ రసం మంచి ఫలితాన్నే ఇస్తుంది.
 
2. గోరువెచ్చని నీటిలో కొద్దిగా యాలకుల పొడి, లవంగాల పొడి కలుపుకుని నెమ్మదిగా చప్పరిస్తూ తాగితే మంచి గుణం కనిపిస్తుంది. 
 
3. ఒక అర చెంచా అల్లం రసంలో ఒక చెంచా చేనె కలుపుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గుతో పాటు దానివల్ల కలిగే ఆయాసం కూడా తగ్గిపోతుంది.
 
4. గోరువెచ్చని పాలల్లో కొద్దిగా యాలుకుల పొడి, మిరియాల పొడి కలుపుకుని రాత్రి పడుకునే ముందు తీసుకుంటే దగ్గు తగ్గి సుఖ నిద్ర  పడుతుంది. అలాగే మిరియాల కషాయం కూడా దగ్గుని తగ్గించడంలో సహాయపడుతుంది.
 
5. ఒక స్పూన్ తులసి ఆకుల రసానికి సమపాళ్లలో తేనె కలిపి వాడితే కఫం వల్ల వచ్చే దగ్గు తగ్గి ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకులను నమిలడం వల్ల ఆయాసం తగ్గు ముఖం పడుతుంది.
 
6. శొంఠిని నీళ్లలో కలిపి కషాయంగా కాచి అందులో పటికబెల్లం కలుపుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గు త్వరగా తగ్గుతుంది. అలాగే శొంఠితో కాచే కాఫీ, టీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments