Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్ల మిరియాలు తింటే.. ఏమవుతుంది..?

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (10:21 IST)
భారతీయ వంటకాల్లోని మసాలాలు రుచికోసమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందులో నల్ల మిరియాలు ఒకటి. నల్ల మిరియాలు మసాలాగానే కాకుండా వివిధ రూపాల్లో తీసుకోవడం వలన అవి క్యాలరీలు బర్న్ చేసి కొత్త ఫ్యాట్ సెల్స్ రాకుండా చూస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నల్ల మిరియాల్లో విటమిన్ ఎ, సి, కె, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. 
 
సాధారణంగా మిరియాలు ఘాటుగా ఉంటాయి. ఆ ఘాటును భరించగలం అనుకునేవాళ్లు ప్రతిరోజూ ఉదయాన్నే ఒకటి రెండు నల్ల మిరియాలను నేరుగా నోట్లో వేసుకుని చప్పరించవచ్చు. ఇలా చేయడం వలన శరీరంలోని మెటబాలిడం క్రమబద్ధం అవుతుంది. అంతేకాదు.. ఇవి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ పెంపొందించి శరీరంలో కొత్త ఫ్యాట్ సెల్స్‌ను తగ్గిస్తాయి. అందుకే సన్నబడాలనుకునేవారు నల్ల మిరియాలను డైట్‌లో చేరిస్తే మంచిది. 
 
రోజూ తినే వెజిటేబుల్ సలాడ్స్‌పైన ఈ నల్ల మిరియాల పొడిని చల్లాలి. దీని వలన సలాడ్ రుచితో పాటు ఆరోగ్యం బాగుంటుంది. చల్లదనం కోసం చేసే మజ్జిగపైన పుదీనా, నిమ్మరసంతో చేసే జ్యూస్‌పై కూడా కొద్దిగా ఈ మిరియాల పొడి చిలకరించి తాగితే శరీర రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఈ మిరియాల పొడిని టీలో కూడా వేసుకుని తాగొచ్చు. 
 
గ్లాస్ నీటిలో ఒక చుక్క ఒరిజినల్ బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను వేసుకుని ప్రతిరోజూ ఉదయాన్నే అల్పాహానికి ముందు తాగితే బరువు తగ్గాలనుకునేవారికి ఫలితం కనిపిస్తుంది. ఈ ఆయిల్‌ను సలాడ్ డ్రెస్సింగ్‌గా కూడా వాడొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments