Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారింజ పొడి నుదిటిపై రాసుకుంటే...?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (15:54 IST)
కమలా పండు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని ఔషధ గుణాలు శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. కమలా పండుతో పాటు వాటి తొక్కలతో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చును.. చాలామంది మధుమేహం, కొలెస్ట్రాల్, క్యాన్సర్, గుండె వ్యాధులు, రక్తపోటు, అధిక బరువు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ వ్యాధుల నుండి విముక్తి చెందాలంటే.. రోజూవారి డైట్‌లో నారింజ తీసుకుంటే చాలు..
 
1. నారింజలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్, న్యూటియన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి. 
 
2. చాలామంది నారింజ తిన్న తరువాత వాటి తొక్కలను పారేస్తుంటారు. ఈ తొక్కల్లోని ప్రయోజనాలు తెలుసుకుంటే.. వీటిని పారేయాలనిపించదు. అవేంటే పరిశీలిద్దాం..
 
3. నారింజ తొక్కలను ఎండబెట్టుకుని పొడిచేసి అందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలుపుకోవాలి. ప్రతిరోజూ నిద్రకు ఉపక్రమించే ముందుగా గ్లాస్ పాలలో ఈ మిశ్రమాన్ని కలిపి సేవిస్తే చక్కని నిద్ర మీ సొంతమవుతుంది.
 
4. చిన్న వయస్సులోని చాలామంది కంటి చూపు కోల్పోతుంటారు. ఈ సమస్య తొలగించాలంటే.. నారింజ తొక్కలను పొడిచేసి ఇందులో కొద్దిగా రోజ్ వాటర్, నిమ్మరసం కలిపి కంటి కింద రాసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే కంటి సమస్య పోతుంది. 
 
5. జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి మంచి ఫలితం ఉంటుంది. నారింజ తొక్క పొడిలో కప్పు పెరుగు, మెంతిపొడి, కలబంద గుజ్జు కలిపి జుట్టు పూతలా వేసుకోవాలి. రెండుగంటల పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి కోసారి చేసినా జుట్టు రాలిపోకుండా ఉంటుంది. 
 
6. తలనొప్పిగా ఉన్నప్పుడు నారింజ పొడిలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి నుదిటిపై రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే నొప్పిగా తగ్గుముఖం పడుతుంది.  
 
7. చలికాలంలో జలుబు ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఒక బౌల్‌లో నీటిని మరిగించుకుని అందులో నారింజ పొడి, నిమ్మరసం కలిపి ఆవిరి పట్టాలి. ఇలా చేస్తే జలుబు నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

తర్వాతి కథనం
Show comments