Webdunia - Bharat's app for daily news and videos

Install App

శొంఠి, లవంగాల పేస్ట్ ముఖానికి రాసుకుంటే..?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (14:56 IST)
మహిళలు ఎదుర్కునే సమస్యలలో మెుటిమల సమస్య కూడా ఒకటి. ఈ మెుటిమల తొలగించుకోవడానికి పలురకాల క్రీమ్స్ వాడుతుంటారు. కానీ, ఈ సమస్య మరింత ఎక్కువవుతుందే కానీ తగ్గడం లేదని బాధపడుతుంటారు. బయట దొరికే క్రీమ్స్ వాడడం ముఖచర్మానికి హానికరమైనదని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. కనుక ఈ కింది చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. అవేంటో చూద్దాం.
 
చాలామంది మెుటిమలను గిల్లుతుంటారు. వాటిని గిల్లితే అవి ఇంకా ఎక్కువైపోతాయి. దాంతో సమస్య మరీ ఎక్కువవుతుంది. కనుక మెుటిమలు వచ్చినప్పుడు వెంటనే ఐస్‌క్యూబ్స్‌తో వాటిపై మర్దన చేయాలి. అప్పుడు అందులోని రసి అంతా బయటకు వచ్చేస్తుంది. అలానే స్పూన్ పసుపును ముఖానికి రాసుకుని అర్థగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే మెుటిమలు పోతాయి. 
 
వేపాకులను నీటిలో మరిగించి, బకెట్ నీళ్లలో ఆ నీటిని కలిపి స్నానం చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరవు. మెుటిమలు రావు. ముల్తానమట్టిలో కొద్దిగా రోజ్‌వాటర్ కలుపుకుని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. 
 
బయటకు వెళ్ళి వచ్చినప్పుడు దుమ్ము, ధూళి ముఖంపై విపరీతంగా ఉంటుంది. కానీ అది మనకు కనిపించదు. దాని వలన మెుటిమలు ఏర్పడే అవకాశాలున్నాయి. కనుక వచ్చిన వెంటనే చన్నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై చర్మ రంధ్రాల్లో దుమ్ము చేరకుండా ఉంటుంది. 
 
శొంఠి ఆరోగ్యానిక మంచి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా అందానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.. శొంఠి, లవంగాలను నీటితో నూరి లేపనంగా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెుటిమలున్న ప్రాంతంలో రాసుకుంటే తక్షణమే సమస్య తగ్గుముఖం పడుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments