Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పాయసాలు.... పురుషులకు భేషుగ్గా పనిచేస్తాయి...

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (12:36 IST)
ఆయుర్వేదం ప్రకారం గోధుమ, బియ్యం, మినప, పెసర వంటి పదార్థాలతో ఇలాంటి వంటకాలు చేసుకుంటే తింటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాటిని తినడం వలన కలిగే ప్రయోజనాలు ఓసారి..
 
1. పాలను సగం వరకు మిగిలేటట్టుకాచి దానిలో ఎనిమిదోవంతు బియ్యాన్ని వేసి ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని పరమాన్నం, పాయసం అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దాంతో పాటు పురుషుల్లో వీర్యాన్ని వృద్ధి చేస్తుంది.
 
2. గోధుమలతో చేసిన పాయసం మంచి బలాన్ని కలిగిస్తుంది. మేధస్సును వృద్ధిచేస్తుంది. వాత, పైత్యరోగాలను తగ్గిస్తుంది. సంభోగశక్తిని పెంచుతుంది. గోధుమ పిండితో చేసిన పరోటా మంచి బలాన్నిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు పథ్యపు ఆహారంగా తినవచ్చును. ఇది వీర్యవృద్ధిని, దృష్టిని కలిగిస్తుంది. సంభోగశక్తిని పెంచుతుంది.
 
3. గోధుమ పిండిని ఒక వంతు, దానికి ఎనిమిదివంతుల శెనగపిండిని తీసుకుని, దానిలో కొంచెం వాము, ఇంగువ, ఉప్పు, నెయ్యి కలిపి బాగా మర్ధించి, దాన్ని చిన్న చిన్న అప్పచ్చలుగా చేసి, పొగలేని నిప్పుల మీద ఎర్రగా అయ్యేంత వరకూ కాల్చాలి. వీటిని తిన్నచో మంచి బలం కలుగుతుంది. శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, వాత వ్యాధులు నిర్మూలిస్తాయి. 
 
4. మినపపిండిని తీసుకుని అందులో మిరియాలు, ఇంగువ, అల్లం.. వీటిని బాగా కలిపి నేతిలోగానీ, నూనెలో గానీ వేయించి దానిని తిన్నచో వాత వ్యాధులను తగ్గిస్తుంది. ఆకలిని వృద్ధిచేస్తుంది. పైత్య వ్యాధులను నిర్మూలిస్తుంది.
 
5. పెసరపప్పుతో చేసిన వడియాలు చాలా రుచిగా ఉంటాయి. ఇది మంచి పుష్టికరమైన ఆహారం. వీర్యాన్ని వృద్ధి చేస్తుంది. రక్తపిత్తం, వాతాన్ని తగ్గిస్తాయి. ఇవి దాహాన్ని అధికం చేస్తాయి.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments