ఈ ఆహారంతో రక్తహీనత(ఎనీమియా)కు చెక్...

శరీరంలో చాలినంత ర‌క్తం లేకపోతే రక్తహీనత (ఎనీమియా) అంటారు. దేహంలో తగినంత ఐరన్‌ లేకపోవడం, విటమిన్ లోపం కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ తరహా కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో

Webdunia
సోమవారం, 16 జులై 2018 (15:50 IST)
శరీరంలో చాలినంత ర‌క్తం లేకపోతే రక్తహీనత (ఎనీమియా) అంటారు. దేహంలో తగినంత ఐరన్‌ లేకపోవడం, విటమిన్ లోపం కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ తరహా కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. సరైన పోషకాహారం లేకపోవడమే రక్తహీనతకు దారితీస్తుంది. చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువ‌వుతోంది.
 
గోళ్లు తెల్లగా పాలిపోవడం, నాలుక మీద‌, కనురెప్పల క్రింద భాగం తెల్లగా ఉండటం, బలహీనంగా ఉండటం, చిన్నచిన్న పనులకే అలసిపోవడం, ఆయాసం రావడం, ఏ ప‌ని చేయాల‌న్నా ఆసక్తి లేకపోవడం త‌దితరాల‌ను ర‌క్త‌హీన‌త ల‌క్ష‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అయితే, ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. 
 
* ఇనుము పుష్కలంగా ఉండే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాల‌ను నిత్యం తీసుకోవాలి.
* రోజుమార్చి రోజు ఖచ్చితంగా తాజా ఆకుకూరలను తీసుకోవాలి. వీటిలో తోటకూర, పుంటి కూర‌, పాలకూర, మెంతి కూర వంటివి తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.
* మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్-సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ తీసుకోవడం వల్ల రక్తహీనత లేకుండా చూడొచ్చు. 
* సోయాబీన్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది దేహానికి పోషకాలను గ్రహించే శక్తినిస్తుంది. 
* బీట్‌రూట్ తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్, ప్రొటీన్‌లు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. 
* బీట్‌రూట్ ఆకుల్లో విటమిన్-ఎ అధికంగా ఉంటుంది. బీట్‌రూట్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవడం ఉత్తమం.
* నువ్వులను పాలలో నానబెట్టి లేదా బెల్లంతో కలిపి తింటే రక్తహీనత తగ్గుతుంది. 
* తేనె కూడా రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులో ఐరన్, కాపర్, మాంగనీస్ లు పుష్కలంగా ఉంటాయి. 
* అరటిపండ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, కిస్‌మిస్, ఉల్లి, క్యారట్, ముల్లంగి, టమాటాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
* సాధారణ ఉప్పు కంటే అయోడిన్ శాతం ఎక్కువగా ఉప్పును వాడటం ద్వారా ఇనుము లోపం వల్ల వచ్చే రక్త హీనతను నివారించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రాపర్టీ డీలర్‌ను పట్టపగలే రోడ్డుపై తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు, వీడియో

Tirupati: ఎబోలా ముప్పును ఎదుర్కోవడానికి తిరుపతిలో అలెర్ట్

రూ.33కోట్ల వ్యయంతో హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు

కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్‌కు ఆశీస్సులు

భార్య నచ్చలేదు.. భర్తే ఆమెను రూ.50వేలకు స్నేహితులకు అమ్మేశాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya :సూర్య, వెంకీ అట్లూరి చిత్రం‘విశ్వనాథ్ & సన్స్ కు స్వాతంత్య్రం

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

తర్వాతి కథనం
Show comments