Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళల్లో అతి దాహం.. అతి ఆకలి దేనికి కారణమంటే?

ప్రపంచాన్ని మధుమేహ వ్యాధి పట్టిపీడిస్తోంది. ముఖ్యంగా, మన దేశంలో కూడా ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వ్యాధి బారినపడే వారిలో చిన్నాపెద్దా అనే తేడాలేదు. అయితే, పురుషులతో పోల్చితే.. మహి

Advertiesment
మహిళల్లో అతి దాహం.. అతి ఆకలి దేనికి కారణమంటే?
, శనివారం, 7 జులై 2018 (09:25 IST)
ప్రపంచాన్ని మధుమేహ వ్యాధి పట్టిపీడిస్తోంది. ముఖ్యంగా, మన దేశంలో కూడా ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వ్యాధి బారినపడే వారిలో చిన్నాపెద్దా అనే తేడాలేదు. అయితే, పురుషులతో పోల్చితే.. మహిళలే ఈ వ్యాధి బారిన అధికంగా పడుతున్నట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి కారణం వారి శారీరక బరువు అధికంగా ఉండటం, వయసుతోపాటు వారిలో వచ్చే భారీ శరీరాలే కారణంగా చెపుతున్నారు.
 
వయసు పెరిగిన తర్వాత డయాబెటిస్‌కి గురవుతున్నవారిలో ఆ వ్యాధి బీజం, వారు గర్భంతో ఉన్నప్పుడే కనిపిస్తుంది. అప్పుడే రక్తంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయి. దీనినే "జెస్టేషన్ డయాబెటిస్" అంటారు. గర్భంలో శిశువు ఆవరించి ఉండే 'మాయ' స్రవించే హార్మోన్లు స్త్రీల శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తాయి. 
 
అందువల్ల గర్భిణీ స్త్రీలు ఆరు, ఏడో నెలల్లో డయాబెటిస్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఇలా చెక్ చేయించుకోనివారిలో గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. అలాగే నెలలు నిండకుండానే ప్రసవించడం లేదా అధిక బరువు కలిగిన బిడ్డలకు జన్మనివ్వడం వంటి సమస్యలు ఎదురవుతాయి. 
 
మధుమేహం ఆరంభ దశలో స్త్రీలలో అంతకుముందెన్నడూ లేని కొన్ని మార్పులు గోచరిస్తాయి. శరీరంమీద రోమాలు పెరగటం, మెడ వెనుక, బాహు మూలల్లో నల్లటి మచ్చలు వంటివి ఏర్పడటం రాబోయే మధుమేహానికి సూచికలని గుర్తించాలి. 
 
ఇవికా.. తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం, అతి దాహం, అతి ఆకలి, ఎంత తిన్నా నీరసంగా ఉండటం, పాదాలు తిమ్మిరులు, చచ్చుబడినట్లుగా అనిపించడం, తరచుగా రోగాలు రావడం, గాయాలు త్వరగా మానకపోవడం, రక్తంలో కొవ్వు అధికంగా ఉండటం, హఠాత్తుగా లైంగిక సమస్యలు ఏర్పడటంతోపాటు కుటుంబంలో పెద్దలకు డయాబెటిస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మధుమేహం ఉన్నదేమో పరీక్ష చేయించుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనంట్లో ఉండే ఆ వేధవాయ్ ఎవరు?