Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొయ్యల్లో పసుపు కలిపి ఇలా చేస్తే..?

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (10:14 IST)
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక మాంసాహారాలలో రొయ్యలు చాలా ముఖ్యమైనవి. ఈ రొయ్యల్లో రెండురకాలున్నాయి. ఏ రొయ్యలు తిన్నా.. మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రొయ్యలు తింటే అధిక బరువు తగ్గుతారు. దాంతోపాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నిల్వలు తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తాయి.
 
తరచు హార్మోన్ల సమస్యలతో బాధపడేవారు రొయ్యలు తింటుంటే శరీరంలో జీవక్రియలు సరిగ్గా నిర్వర్తింపబడుతాయి. ఆ సమస్య నుండి బయటపడవచ్చును. రొయ్యలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా చేస్తాయి. దాంతోపాటు శరీరానికి కావలసిన పోషక విలువలను పుష్కలంగా అందిస్తాయి.
 
రొయ్యలో ఉండే ప్రోటీన్స్ శరీరంలో కండరాల నిర్మాణానికి, కొత్త కణజాలం ఏర్పాటు అయ్యేందుకు ఉపయోగపడుతుంది. రొయ్యల్లో శరీరానికి అవసరమయ్యే జింక్, సెలీనియం, కాపర్, మెగ్నిషియం తదితర పోషకాలు పుష్కలంగా ఉన్నందువలన వీటిని తింటే మన శరీరానికి పోషణ లభిస్తుంది. కనుక వారంలో ఒక్కసారైన రొయ్యలతో తయారుచేసిన ఆహార పదార్థాలు తింటే ఫలితం ఉంటుందని వారు చెప్తున్నారు. 
 
రొయ్యలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఆపై వీటిలో కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి కొద్దిగా నీరుపోసి బాగా ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తరువాత నీటిని వంపుకుని వాటిలో కొద్దిగా కారం, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కేసరి పొడి వేసి కలుపుకుని ఓ 20 నిమిషాలపాటు అలానే ఉంచాలి. ఆ తరువాత బాణలిలో నూనెను వేడిచేసి అందులో ఈ రొయ్యలు వేయించుకోవాలి. ఈ తయారుచేసిన రొయ్యలు తరచు తింటే శరీరంలో రక్తం బాగా తయారవుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

Banakacherla: గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టును సమర్థించిన ఏపీ చంద్రబాబు

PM Modi: 103 నిమిషాల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం.. రికార్డ్ బ్రేక్

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

తర్వాతి కథనం
Show comments