కావలసిన పదార్థాలు:
ఉసిరికాయ ముక్కలు - 1 కప్పు
ఆవనూనె - అరస్పూన్
పచ్చిమిర్చి - 2
కారం, జీలకర్ర - ఒకటిన్నర స్పూన్
పసుపు - పావుస్పూన్
సోంపు - అరస్పూన్
ఇంగువ - కొద్దిగా
ధనియాలు - 1 స్పూన్
ఉప్పు - సరిపడా
కొత్తిమీర తరుగు - కొద్దిగా.
తయారీ విధానం:
ముందుగా నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేడిచేసి పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర, ఆవాలు వేసి సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి. తరువాత అందులో ఆమ్లా ముక్కలు వేసి సన్నని మంటపై 3 నిమిషాలు ఉడికించాలి. ఉడికే క్రమంలో ఈ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కారం, పసుపు, సోంపు, ధనియాల పొగులు, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ మిశ్రమాన్ని గరిటెతో కలుపుకోవాలి. కూర బాగా దగ్గర పడిన తర్వాత దించి దానిపై కొత్తిమీర తరుగు చల్లి వేడివేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.