Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం.. ఆస్కార్ తర్వాత గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా...?

బాలీవుడ్ అగ్ర హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా అందగత్తెతో పాటు నటి కూడా. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడంతో పాటు, భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి సైతం ఎంపికై

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (16:59 IST)
బాలీవుడ్ అగ్ర హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా అందగత్తెతో పాటు నటి కూడా. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడంతో పాటు, భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి సైతం ఎంపికైంది. కేవలం తన టాలెంటును ఇండియాకే పరిమితం చేయకుండా ఇంటర్నేషనల్ లెవల్లో పాపులర్ అయింది. ఇప్పటికే పలు పాప్ ఆల్బమ్స్ కూడా విడుదల చేసింది. 
 
అమెరికన్ టీవీ సీరిస్‌లో నటించింది. అంతటితో ఆగకుండా బేవాచ్ అనే సినిమాలో నటిస్తోంది. మోడలింగ్ రంగంలో కెరీర్ తొలినాళ్లలో కష్టపడిన ప్రియాంక చోప్రా అంచెలంచెలుగా ఉన్నతస్థాయికి ఎదిగింది. ఇందుకు గుర్తింపుగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు మరో గౌరవం దక్కింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసిన ప్రియాంక.. వచ్చే ఏడాది గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా ప్రదానం చేయనుంది. 
 
జనవరి 8న లాస్ ఏంజిల్స్‌లో గోల్డెన్ గ్లోబ్ అవార్డులను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక విజేతకు అవార్డును అందజేయనున్నట్లు గోల్డెన్ గ్లోబ్ ప్రకటించింది. సినిమా, టెలివిజన్ క్యాటగిరీల్లో గోల్డెన్ అవార్డులను అందజేస్తారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా గోవాలో న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటోంది. అమెరికాలో టీవీ షో క్వాంటికోలో సీఐఏ ఏజెంట్‌గా నటిస్తున్న ప్రియాంక షోకు కాస్త బ్రేక్ తీసుకుంది. అదేవిధంగా వచ్చే ఏడాది ప్రియాంక రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిసింది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments