Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాదర్స్ డే.. మైకేల్‌ స్మరణ లేదని నెటిజన్ల ఫైర్: ఝలక్ ఇచ్చిన మైకేల్ జాక్సన్ కూతురు!

ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుని.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయినప్పటికీ తన నృత్యంతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన మైకేల్ జాక్సన్ అంటే తెలియనివారుండరు. అలాంటి కళాకారుడిని పితృదిన

Webdunia
బుధవారం, 22 జూన్ 2016 (17:51 IST)
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుని.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయినప్పటికీ తన నృత్యంతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన మైకేల్ జాక్సన్ అంటే తెలియనివారుండరు. అలాంటి కళాకారుడిని పితృదినోత్సవం సందర్భంగా ఆయన సంతానం పట్టించుకోలేదని విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. తండ్రిగా ఆయన సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించినా.. ఆయనను గుర్తు చేసుకుని పిల్లలు లేరని సోషల్ మీడియా ఫాదర్స్ డే సందర్భంగా నెటిజన్లు ఫైర్ అయ్యారు. 
 
అయితే మైకేల్ జాక్సన్ కుమార్తె పారిస్ జాక్సన్ ఈ వార్తలపై ఫైర్ అయ్యింది. ఆదివారం (జూన్-19) ఫాదర్స్ డే కావడంతో చాలామంది సెలెబ్రిటీలు తమ తండ్రితో కూడిన ఫోటలను పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో హంగామా చేశారు. అయితే పారిస్ మాత్రం ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. దీంతో మైకెల్‌కి వీరాభిమానులైన  కొంతమంది నెటిజన్లు పారిస్‌ను విమర్శిస్తూ పోస్టు చేశారు. 
 
ఆ పోస్టులు చూసి 18ఏళ్ల పారిస్‌కు చాలా కోపమొచ్చేసింది. సెలవు దినమైన ఓ రోజున (ఫాదర్స్ డే) ఒకరిని వేధించాలని మీరు అనుకుంటే అది చేయాల్సిన పనేనా అనేది ముందుగా నిర్ణయించుకోండని సూచించింది. మన దురదృష్టం ఏంటంటే అందరికీ మొదట నెగెటివ్ విషయాలే కనిపిస్తాయి. అవే ప్రచారం అవుతాయని సమాధానమిచ్చింది.

తన తండ్రిని గురించి ప్రత్యేకంగా ఆ రోజే చెప్పుకోవాల్సిన పనిలేదని.. ఆయనను ప్రతినిత్యం ప్రేమిస్తూ.. స్మరిస్తూనే ఉన్నానని పారిస్ మైకేల్ చెప్పుకొచ్చింది. ఫాదర్స్ డే రోజున ఇలాంటి పోస్టుల ద్వారానే తండ్రిపై గల ప్రేమను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని విమర్శలు చేసిన వారికి ధీటుగా సమాధానమిచ్చింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments