Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఓం నమో వేంకటేశా''లో శ్రీవారిగా శౌరబ్ రాజ్ జైన్.. శ్రీదేవి, భూదేవిలుగా విమల, పావని!!

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ''ఓం నమో వేంకటేశా'' సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదా

Webdunia
బుధవారం, 22 జూన్ 2016 (17:36 IST)
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ''ఓం నమో వేంకటేశా'' సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీసాయి వంటి భక్తిరస చిత్రాలు మంచి హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో.. వేంకటేశ్వర స్వామి భక్తుడు హాథీరామ్ బాబా కథతో తెరకెక్కే ''ఓం నమో వేంకటేశా'' సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 2 నుంచి ప్రారంభం కానుంది. 
 
ఇక ఈ సినిమాలో శ్రీవారిగా బాలీవుడ్ యాక్టర్, మహాభారతంలో శ్రీకృష్ణుడిగా నటించిన బాలీవుడ్ యాక్టర్ శౌరబ్ రాజ్ జైన్ నటిస్తుండగా, శ్రీదేవి పాత్రకు విమలారామన్, భూదేవి పాత్రకు పావని గంగిరెడ్డిని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని కీలకమైన సన్యాసి పాత్రలో బాహుబలి దేవసేన అనుష్క నటిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించే అవకాశం రావడంపై మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా ద్వారా పాపులరైన పావని గంగిరెడ్డి హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది మహేష్ బాబు బ్రహ్మోత్సవం, సుమంత్ అశ్విన్ రైట్ రైట్ సినిమాల్లోనూ పావని గంగిరెడ్డి నటించింది. ఇకపోతే.. ఓం నమో వేంకటేశాయ సినిమాకు యమ్.యమ్. కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. అలాగే నాగార్జున గడ్డం లుక్‌లో ఈ చిత్రంలో కనిపిస్తారు. 

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments