కరోనా కాటుకు గ్రామీ అవార్డు విజేత మృతి

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (20:10 IST)
కరోనా వైరస్ మరో గాయకుడుని పొట్టనబెట్టుకుంది. ఆయన పేరు జాన్ ప్రిన్. వయసు 73 యేళ్లు. ఈయన గ్రామీ అవార్డును గెలుసుకున్నారు. పైగా, రచయితగా కూడా కొనసాగారు. గ‌త కొద్ది రోజులుగా శ్వాస‌కోశ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న మార్చి 26న నాష్విల్లెలో ప్రిన్ ఆసుప‌త్రిలో చేరారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని అత‌ని భార్య ఫియోనా వీల‌న్ ప్రిన్‌, మేనేజ‌ర్ ధృవీక‌రించారు.
 
అక్టోబరు 10, 1946లో జ‌న్మించిన జాన్ ప్రిన్ 14 ఏళ్ళ వ‌య‌స్సులోనే త‌న అన్న‌య్య ద‌గ్గ‌ర గిటార్ వాయించడం నేర్చుకున్నాడు. ఓల్డ్ టౌన్ స్కూల్ ఆఫ్ ఫోక్ మ్యూజిక్‌లో సంగీత తరగతులకు హాజరయ్యాడు. ఇల్లినాయిస్లోని సబర్బన్ మేవుడ్లోని ఉన్నత పాఠశాల నుండి డిగ్రీ పట్టా పుచ్చుకున్నాక.. ప్రిన్ ఐదేళ్లపాటు మెయిల్ క్యారియర్‌గా పనిచేశాడు, అప్పుడప్పుడు 'ఓపెన్ మైక్' రాత్రులలో సాయంత్రం చికాగో క్లబ్‌లలో ప్రదర్శన ఇచ్చాడు. 
 
ప్రిన్ 1970లలో ఆల్బమ్‌ల స్ట్రింగ్‌ను విడుదల చేశాడు. అతని జాన‌ప‌ద సంగీతం అమెరికా వ‌ర‌కు విస్త‌రించింది. 1980 లలో, రికార్డింగ్ పరిశ్రమతో విసుగు చెందిన అతను తన సొంత లేబుల్ ఓహ్ బాయ్ రికార్డ్స్‌ను ప్రారంభించాడు. అనేక ఆల్బ‌మ్స్ రూపొందించాడు. తొలిసారి మొదటి గ్రామీ అవార్డును 1991లో గెలుచుకున్నాడు. 
 
జాన్ ప్రిన్ మరణానికి సంతాపం తెలుపుతున్నాము అని రికార్డింగ్ అకాడమీ లిఖితపూర్వక ప్రకటనలో తెలిపింది. అత్యంత ప్ర‌భావ‌వంతమైన గేయ ర‌చ‌యిత‌ల‌లో ఆయ‌న‌ ఒక‌రు. రాబోయే రోజుల‌లో ఆయ‌న సంగీతం సంగీతకారుల‌ని ఎంత‌గానో ప్రేరేపిస్తుంది. వారి ఆత్మ‌క‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాం అని వారు ప్ర‌క‌ట‌నలో తెలియ‌జేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments