Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ నేరగాళ్లకు చిక్కిన 'సముద్రపు దొంగలు'... రూ.2 వేల కోట్లకు కుచ్చుటోపీ

రోజురోజుకీ సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. కాదేదీ కవితకు అనర్హం అన్న చందాన కాదేదీ హ్యాక్ చేసేందుకు అనర్హం అంటూ రెచ్చిపోతున్నారు. సముద్రాల్లో దారికాచి, వీరోచితమైన పోరాటాలు చేసి, ఖజానాలు కొల్లగొట్టే సముద్రపు దొంగలు సైతం ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చు న

Webdunia
మంగళవారం, 16 మే 2017 (15:22 IST)
రోజురోజుకీ సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. కాదేదీ కవితకు అనర్హం అన్న చందాన కాదేదీ హ్యాక్ చేసేందుకు అనర్హం అంటూ రెచ్చిపోతున్నారు. సముద్రాల్లో దారికాచి, వీరోచితమైన పోరాటాలు చేసి, ఖజానాలు కొల్లగొట్టే సముద్రపు దొంగలు సైతం ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుండి తప్పించుకోలేకపోయారు. ఫలితంగా 2 వేల కోట్ల రూపాయలు గాల్లో దీపంలా ఊగిసలాడుతున్నాయి.


వివరాల్లోకి వెళ్తే -వాల్ట్ డిస్నీ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్-5' సినిమా మే 25న విడుదల కానుంది. జానీడెప్ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా సిరీస్‌లో ఇప్పటికే మొదటి నాలుగు భాగాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. మరో 10 రోజుల్లో ఈ చిత్రం విడుదల కానుందనగా వాల్ట్ డిస్నీ కంప్యూటర్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు సినిమా ప్రింట్‌ను దొంగిలించి ఇప్పుడు బేరసారాలకు దిగారు. 
 
భారీ మొత్తాన్ని ఇవ్వకుంటే సినిమాని ముందే ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని డిస్నీ స్టూడియో సిఈఓ వెల్లడించారు. కానీ ఈ సంఘటనపై ఎఫ్‌బిఐని ఆశ్రయించాలనుకుంటున్నామని బాబ్ ఇగర్ చెప్పారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments