Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో టిక్కెట్ వార్ : మంత్రులను ఎక్కిదిగిన హీరో సిద్ధార్థ్

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (13:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై సినీ హీరోలు ఒక్కొక్కరుగా ఎదురుదాడికి దిగుతున్నారు. సినిమా టిక్కెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం భారీగా తగ్గించింది. వీటిపై హీరో నాని మాట్లాడుతూ, సినిమా కలెక్షన్ల కంటే కిరాణా కొట్టు కలెక్షన్సే అధికంగా ఉన్నాయంటూ గురువారం సంచలన కామెంట్స్ చేశారు. దీనికి హీరో సందీప్, దర్శకుడు దేవకట్టా, నిర్మాత నాగవంశీలు మద్దతు ప్రకటించారు. ఇపుడు ఈ జాబితాలో మరో హీరో సిద్ధార్థ్ చేరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"సినిమా ఖర్చు తగ్గింది. డిస్కౌంట్‌ను కస్టమర్లకు పంచాలని మాట్లాడే మంత్రులు... మేం పన్నులు చెల్లింపుదారులం. మీ విలాసాలన్నింటికీ మేం పన్నులు చెల్లిస్తున్నాం...+ లక్షల కోట్లను రాజకీయ నాయకులు అవినీతితో సంపాదించారు. మీ విలాసాలను తగ్గించుకోండి. మా తగ్గింపు ఇవ్వండి. #ఏదిలాజిక్?" అంటూ సంచలన ట్వీట్ చేశారు. 
 
హీరో నాని, సందీప్ కిషన్, దేవకట్టా, నాగవంశీ చేసిన వ్యాఖ్యల కంటే సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏపీ మంత్రులను హీరో సిద్ధార్థ్ బాగా ఎక్కిదిగారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన సినిమా టిక్కెట్ల వార్ ఇపుడు తారా స్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఒకవైపు హీరోలు, మరోవైపు మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

ప్రజాదర్బార్‌లో ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు వినతులు వెల్లువ!!

ఐస్‌క్రీమ్‌లో జెర్రి... ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన మహిళకు షాక్!

గంగా నదిలో మునిగిన బోటు... ఆరుగురు గల్లంతు!!

రాజీనామా చేసిన జగన్ వీరవిధేయుడు కరికాల వలవన్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments