సుస్మితా సేన్ ప్రేమాయణం ముగిసింది.. ప్రియుడితో బంధం కట్

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (13:27 IST)
మాజీ మిస్ యూనివర్శ్ గా చలామణీ అవుతున్న సుస్మితా సేన్ సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫొటోలనూ వదలుతూనే ఉంది. ఇప్పుడు ఆమెకు 45 ఏళ్లు. ఇక ఈ వయసులోనూ అందాల విందు చేస్తూ రెచ్చిపోతోంది. ఘాటు ఘాటు ఫొటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు మతులు పోగొడుతుంది. 
 
సుస్మితా సేన్ ఫిట్‌నెస్‌ లెవల్స్‌ చూసి బాలీవుడ్‌ హీరోయిన్స్‌ కూడా సర్‌ప్రైజ్ అవుతున్నారు. 45 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా ఎలా ఉందని డిస్కషన్లు పెడుతున్నారు. 
 
ఇంత ఏజ్‌లో కూడా సుస్మితా సేన్ తన బ్యూటీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని బాలీవుడ్‌ బ్యూటీస్‌ ఆశ్చర్యపోతుంటారు. అయితే ఫార్టీ ఫైవ్‌ ప్లస్‌లో కూడా గ్లామర్ చెక్కుచెదరకపోవడానికి యోగా కారణమంటుంది సుస్మితా సేన్.
 
బాలీవుడ్ సుందరి సుస్మితాసేన్ గత కొద్ది కాలంగా తన బాయ్​ఫ్రెండ్​ తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్​మన్​ షాల్​తో డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లోనే ఉంటున్నారు. 
 
సోషల్​మీడియాలోనూ వీరిద్దరూ కలిసి వర్కౌట్స్​​ చేసిన వీడియోలను సుస్మిత పోస్ట్​ చేస్తూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. అయితే ఇప్పుడు వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. 
 
మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్‌, నటుడు రోహ్మాన్‌ షాల్‌‌తో ప్రేమాయణానికి ముగింపు పలికింది. ఇద్దరం విడిపోయినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. స్నేహితులుగానే వుంటాం.. ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదని పోస్టు పెట్టింది. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

బీహార్‌లో ఘోర పరాజయం.. రాజకీయాలకు బైబై చెప్పనున్న ప్రశాంత్ కిషోర్?

మావోయిస్టుల మాట విని యువత చెడిపోవద్దు : బండి సంజయ్ హితవు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments