Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్ను ఎగవేత కేసులో చైనా ముద్దుగుమ్మకు భారీ అపరాధం

ప్రముఖ చైనీస్ నటి, మోడల్, గాయని ఫ్యాన్ బింగ్ బింగ్(37)కు చైనా ప్రభుత్వం షాకిచ్చింది. పన్ను ఎగవేత కేసులో రూ.945 కోట్ల జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించారు.

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (18:49 IST)
ప్రముఖ చైనీస్ నటి, మోడల్, గాయని ఫ్యాన్ బింగ్ బింగ్(37)కు చైనా ప్రభుత్వం షాకిచ్చింది. పన్ను ఎగవేత కేసులో రూ.945 కోట్ల జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించారు. ఎక్స్‌ మ్యాన్‌, ఐరన్‌మ్యాన్‌, యాష్‌ ఈజ్‌ పూరెస్ట్‌ వైట్‌ వంటి హాలీవుడ్ చిత్రాల్లో బింగ్ బింగ్ నటించింది. అయితే ఆమె నటించిన కొన్ని సినిమాలకు సంబంధించి భారీగా పన్ను ఎగవేత పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
 
విచారణలో భాగంగా అధికారులు ఇప్పటికే బింగ్ బింగ్ అధికార ప్రతినిధిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాదాపు 129 మిలియన్ డాలర్లు(రూ.945 కోట్లు) కట్టాల్సిందిగా చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ట్యాక్సేషన్ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఒకవేళ జరిమానాను చెల్లించలేని పక్షంలో క్రిమినల్ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశించింది. 
 
ఈ నోటీసుపై ఆమె స్పందిస్తూ దేశ చట్టాలను తాను చాలా గౌరవిస్తానని, తన ప్రవర్తన, చట్టాలను దుర్వినియోగం చేయడం పట్ల సిగ్గుపడుతున్నట్లు చెప్పింది. బింగ్ దేశంలోని ప్రతి ఒక్కరినీ క్షమాపణలు కోరుతూ చైనా మైక్రో బ్లాగింగ్ సైట్ వైబోలో సందేశాన్ని పోస్ట్ చేసింది. చైనాలో లగ్జరీ ఎండోర్స్‌మెంట్లతో ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకునే బింగ్ జూలై 1వ తేదీన ఎవరికీ కనిపించకుండా అదృశ్యమైంది. అయితే ఆమె ప్రాణ రక్షణ నిమిత్తం అమెరికాకు పారిపోయిందనీ, చైనా అధికారులు ఆమెను నిర్భంధంలో ఉంచారని కూడా వార్తలు గుప్పుమన్నాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments