Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పన్ను ఎగవేత కేసు.. ఫ్యాన్స్‌కు ముఖం చూపించలేక అదృశ్యమైన చైనీస్ నటి

ఆదాయ పన్ను ఎగవేత బండారం బయటపడటంతో తన అభిమానులకు ముఖం చూపించలేక ఓ చైనీస్ నటి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆమె పేరు ఫ్యాన్ బింగ్ బింగ్. 1999లో మైఫెయిర్ ప్రిన్సెస్ అనే టీవీ సీరీస్‌తో బుల్లితెరకు పరిచయమైంది

పన్ను ఎగవేత కేసు.. ఫ్యాన్స్‌కు ముఖం చూపించలేక అదృశ్యమైన చైనీస్ నటి
, మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (09:37 IST)
ఆదాయ పన్ను ఎగవేత బండారం బయటపడటంతో తన అభిమానులకు ముఖం చూపించలేక ఓ చైనీస్ నటి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆమె పేరు ఫ్యాన్ బింగ్ బింగ్. 1999లో మైఫెయిర్ ప్రిన్సెస్ అనే టీవీ సీరీస్‌తో బుల్లితెరకు పరిచయమైంది.
 
ఆ తర్వాత 2003 లో సెల్‌ఫోన్ అనే సినిమా ద్వారా చెనీస్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ద్వారా ఉత్తమ నటి గౌరవ పురస్కారాన్ని కూడా అందుకుంది. 
 
అనంతరం 2008 నుంచి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో రెడ్‌కార్పెట్‌పై వాక్ చేస్తూ ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా, ఎక్స్‌మ్యాన్, ఐరన్‌మ్యాన్ 3 సినిమాల్లో నటించి హాలీవుడ్‌లో మంచి గుర్తింపుపొందింది. ఇలా హాలీవుడ్, చైనీస్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఫ్యాన్, సడెన్‌గా జులై ఒకటో తేదీన నుంచి ఎవ్వరికీ కనిపించకుండా పోయింది. 
 
దీంతో ఆమె అభిమానులు కంగారుపడిపోయారు. తమ అభిమానికి ఏమైందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారు. ఆమె అభిమానుల్లో ఒకరు అసలు విషయాన్ని వెల్లడించారు. ఒక సంస్థ నుంచి 7.8 మిలియన్ డాలర్లు పారితోషికం అందుకొని, పన్ను ఎగ్గొట్టేందుకు 1.6 మిలియన్ చూపించిందని ఈ విషయం బయటకు రావడంతో.. ఆమె అదృశ్యమైనట్టు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అదుగో' సినిమాను పూర్ణ ఆదుకుంటుందా..?