Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అదుగో' సినిమాను పూర్ణ ఆదుకుంటుందా..?

ర‌విబాబు తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ అదుగో. ఇందులో బంటి అంటే పందిపిల్ల ప్ర‌ధాన పాత్ర పోషించ‌డం విశేషం. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి. అయితే... కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇప్పుడు త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంద

Advertiesment
'అదుగో' సినిమాను పూర్ణ ఆదుకుంటుందా..?
, సోమవారం, 17 సెప్టెంబరు 2018 (21:24 IST)
ర‌విబాబు తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ అదుగో. ఇందులో బంటి అంటే పందిపిల్ల ప్ర‌ధాన పాత్ర పోషించ‌డం విశేషం. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి. అయితే... కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇప్పుడు త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఇట‌వ‌ల రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. పంది పిల్ల‌తో సినిమా ఏంటి అనేది అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను ఆస‌క్తి క‌లిగిస్తుంది.
 
ఇదిలావుంటే.. అదుగో సినిమాను పూర్ణ ఆదుకోవ‌డం ఏంటి? అంటారా..? ఈ సినిమాలో న‌టి పూర్ణ ప్ర‌త్యేక గీతంలో న‌టించ‌నుంది. ఈ పాట సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఈ పాట‌లో పూర్ణ‌తో పాటు సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్న బంటి అనే పందిపిల్ల కూడా క‌నిపించ‌నుంది. ఈ పాట విజువ‌ల్ ట్రీట్ ఇవ్వ‌బోతుంది అంటున్నాడు ర‌విబాబు. 
 
ఈ సంద‌ర్భంగా పాట‌లోని పూర్ణ‌ స్టిల్ ఒక‌టి విడుద‌ల చేసారు. ప్ర‌శాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు. ద‌స‌రా సెల‌వుల్లో విడుద‌ల కానుంది అదుగో. ఇత‌ర భాష‌ల్లోకి కూడా అనువాదం అయి.. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు ద‌ర్శ‌కనిర్మాత‌లు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో అదుగో చిత్రం విడుద‌ల కానుంది. మ‌రి.. అదుగో సినిమాని పూర్ణ స్పెష‌ల్ సాంగ్ ఎంత వ‌ర‌కు ఆదుకుంటుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ‌న్నీ, ఎన్టీఆర్... చైత‌న్య‌ని చూసి నేర్చుకోవాలి..!