Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌‍లో దుమ్ము రేపుతున్న "అవతార్" కలెక్షన్లు

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (13:21 IST)
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన చిత్రం "అవతార్". ఈ నెల 16వ తేదీన విడుదైలన ఈ చిత్రం కలెక్షన్ల దుమ్ము రేపుతోంది. ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డులు నెలకొల్పే దిశగా కలెక్షన్లు రాబడుతోంది. భారత్‌లో ఆరో రోజున కూడా ఏకంగా 15 కోట్ల రూపాయల మేరకు కలెక్షన్లు రాబట్టింది. తద్వారా రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టనుంది. 
 
ఈ చిత్రానికి ఉత్తరాది కంటే దక్షిణాది ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్పందన వస్తుంది. ఫలితంగా ఇప్పటికే రూ.40 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. భారతీయ చలనచిత్ర మార్కెట్‌లో "అవెంజర్స్ ఎండ్‌గేమ్" తర్వాత రెండో అత్యధిక బాక్సాఫీస్ ఓపెనర్‌గా "అవతార్" నిలిచింది. "అవెంజర్స్" గత 2019లో విడుదలై తొలి రోజున రూ.53.10 కోట్ల మేరకు వసూళ్లను రాట్టింది. ఇపుడు అవతార్ ఈ రికార్డును బ్రేక్ చేసింది. 
 
గత శుక్రవారం విడుదలైనప్పటికీ ఆరో రోజైన బుధవారం కూడా కలెక్షన్ల వరద తగ్గలేదు. దాంతో భారత బాక్సాఫీస్ మార్కెట్‌లో రూ.200 కోట్ల కలెక్షన్ల మార్కుకు చేరుకున్న చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు మొత్తం రూ.179.30 కోట్లకు చేరింది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments