Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికన్ కమెడియన్ గిల్బర్ట్ గాట్ ఫ్రైడ్ కన్నుమూత

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (18:05 IST)
gilbert gott fried
ప్రముఖ అమెరికన్‌ స్టాండప్‌ కమెడియన్‌, నటుడు గిల్బర్ట్ గాట్‌ఫ్రైడ్‌(67) కన్నుమూశారు. అనారోగ్యంతో మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పాపులర్‌ ఎన్‌బీసీ సంస్థ లోని "సాటర్డే నైట్‌ లైవ్‌" సినిమాలో గిల్బర్ట్ నటించి మెప్పించారు. అంతేకాదు యానిమేటెడ్‌ డిస్నీ మూవీ "అలాద్దీన్‌"లో వ్యంగ్య చిలుక వాయిస్‌తో మెప్పించారు.
 
తన వాయిస్‌తో ప్రపంచ ప్రేక్షకులను నవ్విస్తూ అలరించిన గిల్బర్ట్ మరణం ప్రపంచ సినిమాకే తీరని లోటని హాలీవుడ్‌ మేకర్స్, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తూ, సంతాపం తెలిపారు. గిల్బర్ట్ కి భార్య, ఇద్దరు కుమారులున్నారు. 
 
అమెరికాలోని బ్రూక్లిన్‌లో 1955 ఫిబ్రవరి 28న జన్మించిన గిల్బర్ట్ న్యూయార్క్ లో స్టాండప్‌ కమెడీయన్‌గా రాణించారు. నాటకాలు వేశారు. ఆయన్ని ప్రారంభంలో ఎడ్జీ కామెడీగా వర్ణించేవారు. తనదైన కామెడీగా ఆడియెన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేయడం ఆయన కామెడీ స్టయిల్‌. 
 
గిల్బర్ట్ అనేక సినిమాల్లో, టెలివిజన్స్, షోస్‌ చేశారు. యానిమేషన్‌ పాత్రలకు వాయిస్‌ అందించారు. పలు షోలకుహోస్ట్ గానూ పనిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments