Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోళిక అనే రాక్షసి అలా చచ్చింది.. అందుకే హోళీ పండుగ వచ్చిందా?

హోళీ పున్నమి మార్చి 2 (శుక్రవారం) రానుంది. ప్రతి ఏడాది రంగపంచమి అదే హోళీ రోజున భగవంతుడైన శ్రీకృష్ణుడికి రాధపై వున్న ప్రేమకు చిహ్నంగా కొనియాడుతారు. బృందావనంలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకునే ఈ పండుగను ఉత్

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (17:32 IST)
హోళీ పున్నమి మార్చి 2 (శుక్రవారం) రానుంది. ప్రతి ఏడాది రంగపంచమి అదే హోళీ రోజున భగవంతుడైన శ్రీకృష్ణుడికి రాధపై వున్న ప్రేమకు చిహ్నంగా కొనియాడుతారు. బృందావనంలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకునే ఈ పండుగను ఉత్తరాదిన అట్టహాసంగా జరుపుకుంటారు. దక్షిణాదిన ఈ పండుగను జరుపుకునే వారి సంఖ్య ఈ మధ్య బాగానే పెరిగిపోతుంది.
 
భగవంతుడైన శ్రీకృష్ణుడు గోపికలతో తన కుచేష్టల ద్వారా ఈ పండుగను ప్రసిద్ధి చెందేలా చేశాడని విశ్వాసం. హోళీకి ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోళిక దహన్ (హోళికను కాల్చడం) లేదా చోటీ హోళి (చిన్న హోళి) అని అంటారు. హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి ప్రహ్లాదుని మంటల్లో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోళిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. ఆంధ్రప్రదేశ్‌లో హోళిక దహన్‌ను కామ దహనం అని అంటారు. 
 
హోలిక అను రాక్షసి అనే రాక్షసి రోజుకు ఒక చంటిబిడ్డను తింటూ, ఒక గ్రామవాసులందరికి గర్భశోకాన్ని కలిగించేదట. ఇలా ఒకరోజు ఒక ముదుసరి మనువడి వంతు వచ్చిందట. అది గమనించిన ఆ వృద్ధురాలు హోళిక రాక్షసి నుంచి మనుమడిని తప్పించుకునేందుకు, ఆ గ్రామస్తుల గర్భశోక బాధను నివారించుటకై ఆ మహిమాన్వితుడైన మహర్షిని వేడుకొంటుంది. 
 
అందుకు ఆ రుషి తల్లీ.. ఆ రాక్షసి ఒక శాపగ్రస్తురాలు, ఎవరైనా ఆ రాక్షసిని నోటికిరాని దుర్భాషలతో తిడితే దానికి వెంటనే ఆయుక్షీణమై మరణిస్తుందని చెబుతాడు. అందుకోసం గ్రామస్తులను పోగుచేసి ఆ విధంగా దుర్భాషలాడమని తరుణోపాయం చెప్పినాడు. దానితో ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంతో గ్రామంలోనికి వెళ్లి రుషి తరుణోపాయం గ్రామస్తులకు చెబుతుంది. ఆ మరుసటి రోడు ఆ గ్రామస్తులందరిచేత ఆ ముదుసలి ఆ రాక్షసిని అనరాని మాటలనిపిస్తుంది. 
 
ఆ దుర్భాషలను తట్టుకోలేక కొండంత హోళి రాక్షసి కుప్పకూలి మరణిస్తుంది. దానితో పిల్లలు పెద్దలు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ కట్టెలు ప్రోగు చేసి ఆ చితిమంటలో హోళిరాక్షసిని కాల్చివేచి వసంతాలు చల్లుకుంటూ పండుగ చేసుకుంటారు. నాటి నుంచే హోళం పండుగ వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా హోళి పండుగ రోజు పితృదేవతలను పూజల ద్వారా సంతృప్తిపరిచి... తర్పణాలు సమర్పిస్తే వంశాభివృద్ధి చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీతో జగన్ మెడకు ఉచ్చు.. విచారణ ఖాయమేనా..?

పవన్ ప్రచారం ఫలించింది.. రేవంతన్న క్యాంపెయిన్ తప్పిపోయింది..

మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే గెలిపించింది.. బాబు, పవన్

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో మిథునరాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే? కష్టం ఫలిస్తుందా?

2025లో వృషభ రాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే?

2025 మేషరాశి వారి కెరీర్, ఉద్యోగం, వ్యాపారం ఎలా వుంటుందంటే?

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

22-11-2024 శుక్రవారం వారం ఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

తర్వాతి కథనం
Show comments