Webdunia - Bharat's app for daily news and videos

Install App

''కురుక్షేత్రం'' మహా పవిత్రం.. ఈ ప్రాంతంలో చనిపోతే.. ఇక స్వర్గప్రాప్తి.. అందుకే?

పాండవులకు, కౌరవులకు మధ్య మహాసంగ్రామం జరిగిన ''కురుక్షేత్రం'' గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. కురుక్షేత్రం అనే పేరు.. ఎలా వచ్చిందంటే.. కురువంశ మూలపురుషుడైన కురువు పేరు మీద ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందంట

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (17:47 IST)
పాండవులకు, కౌరవులకు మధ్య మహాసంగ్రామం జరిగిన ''కురుక్షేత్రం'' గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. కురుక్షేత్రం అనే పేరు.. ఎలా వచ్చిందంటే.. కురువంశ మూలపురుషుడైన కురువు పేరు మీద ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందంటారు. కురుక్షేత్రం కంటే ముందు ఈ ప్రాంతాన్ని ''బ్రహ్మవర్త'' అని పిలిచేవారట. సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ ప్రాంతంలో యజ్ఞం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
అంతేగాకుండా వ్యాసభగవానుడు.. ఈ తపోభూమిలోనే పురాణాలు రచించారట. 'కురుక్షేత్రం'లోనే అర్జునుడికి కృష్ణపరమాత్ముడు గీతోపదేశం చేశాడు. అలాగే అంపశయ్యపై వున్న భీష్ముడు ''విష్ణు సహస్రనామాలు" చెప్పిన పుణ్యభూమి కూడా ఇదే. అందుకే 'కురుక్షేత్రం' ధర్మక్షేత్రంగా.. తపోభూమిగా ఇప్పటికీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 
 
ఎంతటి పాపాలు చేసిన వారైనా ఈ ప్రదేశంలో చనిపోతే వారికి స్వర్గలోక ప్రాప్తి కలగాలని 'కురువు' దేవేంద్రుడిని కోరగా .. అందుకు దేవేంద్రుడు అనుగ్రహించాడని స్థలపురాణం. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రాంతంలో మహాసంగ్రామాన్ని నిర్వహించినట్లు చెప్తారు. 
 
ఇకపోతే.. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఓ ప్రముఖ ఘట్టంగా మిగిలిపోయింది. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. భగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో ఆవిర్భవించింది ఈ ప్రాంతంలోనే. శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనాన్ని ఇదే ప్రాంతంలోనే అర్జునునికి కల్పించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

24-08-2025 నుంచి 30-08-2025 వరకు మీ వార ఫలితాల - వృత్తి ఉద్యోగాల్లో రాణింపు...

24-08-2025 ఆదివారం మీ రోజువారీ ఫలితాలు

Padmanabhaswamy: శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో కంప్యూటర్ సిస్టమ్, సర్వర్ డేటాబేస్ హ్యాక్

తర్వాతి కథనం
Show comments