Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడుగకపోయినా దర్శకేంద్రుడికి 'శ్రీవారు' అలా ప్రసాదిస్తున్నారా...?

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. మొదటిసారి తిరుమల స్వామివారి సన్నిధిలో అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఎప్పటి నుంచో శ్రీవారిపై సినిమాలు తీస్తున్న రాఘవేంద్రరావుకు స్వామివారు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయనకు సిఎం అవకాశం ఇచ్చారు. రెండేళ్ళ పాట

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (20:02 IST)
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. మొదటిసారి తిరుమల స్వామివారి సన్నిధిలో అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఎప్పటి నుంచో శ్రీవారిపై సినిమాలు తీస్తున్న రాఘవేంద్రరావుకు స్వామివారు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయనకు సిఎం అవకాశం ఇచ్చారు. రెండేళ్ళ పాటు పాలకమండలిలో కొనసాగిన రాఘవేంద్రరావు వివాద రహితుడిగా పనిచేశారు. తన వారికి కూడా సేవా టిక్కెట్లు తీసివ్వకుండా సామాన్య భక్తుల కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాదు టిటిడి ఎస్వీబిసీ ఛానల్‌ను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేశాడు. 
 
అయితే రాఘవేంద్రరావు పదవీకాలం ముగిసింది. పాలకమండలి మొత్తం తట్టాబుట్టా సర్దేశింది. అయితే కొత్త పాలకమండలిలో తిరిగి రాఘవేంద్రరావుకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారట. దర్శకేంద్రుడు అడగకపోయినా ఆయనకు అవకాశం ఇవ్వాలన్నది సిఎం ఉద్దేశమట. అందుకే కొత్త పాలకమండలిలో రాఘవేంద్రరావు పేరు ఉండేటట్లుగా చూడాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంమీద మరోసారి దర్శకేంద్రుడికి శ్రీవారి సన్నిధిలో పనిచేసే అవకాశం రానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

అన్నీ చూడండి

లేటెస్ట్

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

భయాన్ని పోగొట్టే భగవంతుని శ్లోకాలు

తోరాన్ని కట్టుకున్నవారు ఎన్ని రోజులు ఉంచుకోవాలి?

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

తర్వాతి కథనం
Show comments