Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి బిడ్డను పూజించడం ఏమిటి...? కానీ గణపతిని పార్వతి పూజించింది.. ఎందుకు? ఎక్కడ?

పార్వతీ దేవి వినాయకుడికి తల్లి. అలాంటిది పార్వతీ దేవి స్వయానా తన కుమారుడిని పూజించింది. తల్లి బిడ్డను పూజించడం ఏమిటి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ పురాణాలు ఇదే చెప్తున్నాయి. ఒకనాడు పార్వతీ దేవి శివుడిని పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించమని అడిగింది.

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (18:40 IST)
పార్వతీ దేవి వినాయకుడికి తల్లి. అలాంటిది పార్వతీ దేవి స్వయానా తన కుమారుడిని పూజించింది. తల్లి బిడ్డను పూజించడం ఏమిటి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ పురాణాలు ఇదే చెప్తున్నాయి. ఒకనాడు పార్వతీ దేవి శివుడిని పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించమని అడిగింది. అప్పుడు శివుడు పార్వతీ దేవికి ఆ మంత్రాన్ని ఉపదేశించి, ఆ మంత్రాన్ని జపం చేయడానికి కొంత కాలవ్యవధిని పెట్టి, అంతకాలం పాటు మాట్లాడకూడదని కూడా చెప్పాడు. 


కానీ పార్వతీ దేవి ఆ విషయాన్ని మాలిని అనే చెలికత్తెకు చెప్పింది. వెంటనే పరమశివుడికి ఆ విషయం తెలిసి, జనన మరణములు ఉండే మనుష్య రూపం పొంది మళ్లీ పంచాక్షరీ మంత్రాన్ని చాలా కాలం పాటు జపం చేస్తే తప్ప నా పక్కన కూర్చునే అధికారం లేదని చెప్తాడు.
 
అప్పుడు పార్వతీ దేవి కైలాసం నుండి బయల్దేరి ఇప్పుడు శ్రీకాళహస్తి అని పిలవబడే ప్రదేశానికి చేరుకుని అక్కడే తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. తపస్సుకు ఆటంకాలేవీ కలగకుండా ఉండటానికి పార్వతీ దేవి తన కుమారుడైన విఘ్నేశ్వరునికి మొదటిసారిగా పూజ చేసింది. ఆ తర్వాత కొంత కాలానికి శివుడు, పార్వతీ దేవి తపస్సుకు మెచ్చి ఆమెను అనుగ్రహించి మళ్లీ ఆయన పక్కన స్థానం కల్పించాడు.
 
పార్వతీ దేవి పూజించిన కారణంగా అక్కడ ఉండే గణపతిని పుష్టి గణపతి అనే పేరుతో పశ్చిమ దిక్కులో వెలసి ఉండమని, ఆ పుష్టి గణపతిని ఎవరు పూజ చేసినా కూడా వారికి విఘ్నాలు లేకుండా వారు అనుకున్నది సాధించేలా వారికి శక్తిని ఇవ్వమని చెప్పింది.
 
ఇప్పటికీ శ్రీకాళహస్తిలో పుష్టి గణపతి పేరుతో వినాయకుడిని దర్శించుకోవచ్చు. పార్వతీ దేవి పూజించిన గణపతి ఆలయం భారతదేశంలోనే కేవలం ఒక్కటే ఉండటం, అది కూడా మన తెలుగు నేలపై ఉండటం విశేషం.

అదే ముద్రగడ పద్మనాభం పరువు తీసేలా వుంది, ఫోన్ చేస్తే వైసిపి నాయకులు లిఫ్ట్ చేయడంలేదట?!!

పిన్నెలి రామకృష్ణారెడ్డి పాత పోస్ట్ వైరల్.. పేలుతున్న జోకులు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

నాకు తెలిసి జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టరు: ఆర్ఆర్ఆర్

కారు పైకి ఎక్కి నుజ్జు నుజ్జు చేసిన ఏనుగు - video

హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో నరసింహ జయంతి ఉత్సవాలు

20-05-202 సోమవారం దినఫలాలు - ఒక స్థిరాస్తి కొనుగోలు అనుకూలిస్తుంది...

19-05-202 ఆదివారం దినఫలాలు - ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి...

19-05-2004 నుంచి 25-05-2024 వరకు మీ వార రాశిఫలాలు

అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. మట్టపల్లి నరసింహుడిని దర్శించుకోండి..

తర్వాతి కథనం
Show comments