Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌందర్యానికి యోగా... ఏయే ఆసనాలు వేస్తే బ్యూటీ...?

అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నప్పటికీ ఇంకా ఇంకా అందంగా ఉండాలంటూ తహతహలాడుతుంటారు. అంతేకాదు కోమలమైన శరీరం కావాలనుకునే అమ్మాయిలు చాలామందే ఉంటారు. ఇలాంటివారికి యోగా చాలా యోగదాయకమైందని అంటున్నారు యోగా గురువులు. యోగా చేయడం వలన అమ్మాయిలు సెక్సీగా కూడా ఉంటారంటున్

Webdunia
గురువారం, 9 జూన్ 2016 (13:59 IST)
అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నప్పటికీ ఇంకా ఇంకా అందంగా ఉండాలంటూ తహతహలాడుతుంటారు. అంతేకాదు కోమలమైన శరీరం కావాలనుకునే అమ్మాయిలు చాలామందే ఉంటారు. ఇలాంటివారికి యోగా చాలా యోగదాయకమైందని అంటున్నారు యోగా గురువులు. యోగా చేయడం వలన అమ్మాయిలు సెక్సీగా కూడా ఉంటారంటున్నారు యోగా నిపుణులు. యోగాతో ముఖం, శరీరంలో కాంతి వస్తుంది. 
 
శరీర రంగు ఏదైనా ఉండొచ్చు. కాని ముఖంలో కళ ఉట్టిపడాలంటే తప్పనిసరిగా యోగా చేయాలి. దీంతో ప్రతి ఒక్కరి దృష్టి మీపైనే ఉంటుంది. ముఖంలో ఉట్టిపడే కళకు మనయొక్క కడుపుకు సంబంధం ఉంది. ఇవి రెండు శుభ్రంగా ఉంచుకోవడానికి నాలుగు ఉపాయాలున్నాయి. వీటిని తప్పనిసరిగా పాటించాలంటున్నారు యోగా నిపుణులు. 
 
1. కంఠాన్ని శుభ్రం చేసుకోవాలి. 2. నోటికి సంబంధించిన వ్యాయామము, బ్రహ్మముద్ర. 3. సర్వాంగాసనం మరియు శీర్షాసనం వేయాలి. 4. జలనేతి మరియు కపాల భాంతి ప్రాణాయామం. వీటిని చేసిన తర్వాత ఐదు నిమిషాల వరకు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. 
 
శరీరం ఆరోగ్యంగా ఉంటే ఆకర్షణీయంగా కూడా కనపడుతుంటారు. దీంతో శరీరం అందంగా కనపడుతుంది. శరీర సౌందర్యం మన వెన్నెముక, శరీర కండరాలపై ఆధారపడి వుంటుంది. శరీరంలో అనవసరమైన కొవ్వు ఉంటే అది వెన్నెముకకు, శరీర కండరాలకు హాని చేస్తుంది. అలాగే శరీరంలో అసలు కొవ్వే లేకుంటే కూడా చాలా ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. దీనికి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. దీనికి కూడా నాలుగు ఉపాయాలున్నాయంటున్నారు యోగా నిపుణులు. 
 
1. సూక్ష్మమైన వ్యాయామం చేయండి. 2. ఆరు ఆసనాలు తప్పనిసరిగా చేయాలి- తాడాసనం, త్రికోణాసనం, పశ్చిమోత్తాసనం, ఉష్ట్రాసనం, ధనురాసనం, నౌకాసనం. 3. ప్రాణాయామం. 4. మాలిష్. ఇవి చేస్తే సౌందర్యరాశి అవుతారంటున్నారు. 
 
ఇవి తప్పనిసరిగా చేస్తే శరీర రంగు ఏదైనా ఉండొచ్చు అమ్మాయిల శరీరం కోమలంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటూ, ముఖం కళ కళలాడుతుంది. అలాగే ఆహారంలోకూడా జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు యోగా గురువులు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments