Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 ఆసనాలతో సూర్య నమస్కారం... ఎలా వేయాలి? ఫలితాలు ఏమిటి...?

సూర్యనమస్కారం పలు యోగాసనాల మేలు కలయిక. ఈ ఆసనాన్ని ఏ వయస్సులోని వారైనా వేయవచ్చు. దీని వలన శారీరకంగానూ, మానసికంగానూ ఉపయోగంగా ఉంటుంది. సూర్యనమస్కారం 12 ఆసనాలతో కలసి ఉంటుంది. ఆసనం వేయు పద్ధతి... నిలబడిన స్థితిలో కాళ్ళను పరస్పరం దగ్గరకు తీసుకు రావాలి. భ

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (13:28 IST)
సూర్యనమస్కారం పలు యోగాసనాల మేలు కలయిక. ఈ ఆసనాన్ని ఏ వయస్సులోని వారైనా వేయవచ్చు. దీని వలన శారీరకంగానూ, మానసికంగానూ ఉపయోగంగా ఉంటుంది. సూర్యనమస్కారం 12 ఆసనాలతో కలసి ఉంటుంది. 
 
ఆసనం వేయు పద్ధతి...
నిలబడిన స్థితిలో కాళ్ళను పరస్పరం దగ్గరకు తీసుకు రావాలి. భుజాలను చక్కగా పైకి తీసుకు రావాలి. తలకుపైకి తీసుకు వచ్చిన అరచేతులను కలపాలి. ఆలాగే ముఖం ఎదుటకు తీసుకువచ్చి నమస్కారం చేసే స్థితికి రావాలి. కలిపిన చేతులు ఛాతీ వద్ద ఉండేలా చూసుకోవాలి.
 
గాలిపీల్చుకుంటూ భుజాలను పైకి తీసుకురావాలి. చెవులను తాకుతూ ఉండాలి. మెల్లగా చేతులను వెనకవైపుకు తీసుకురావాలి. వీలైనంతగా తలను వెనక్కు వంచాలి. 
 
మెల్లగా గాలి వదులుతూ ముందుకు వంగాలి. చేతులను సమాంతరంగా ఉంచుతూ నేలను తాకాలి. ఈ సమయంలో తల మోకాలిని తాకుతూ ఉండేంతవరకూ తీసుకురావాలి. ఈ స్థితిలో కొన్నిసెకనులు అలాగే ఉండాలి. దీనినే పాద పశ్చిమోత్తాసనం అంటారు. 
 
గాలి పీల్చుతూ కుడికాలును వెనక్కు తీసుకురావాలి. వీలైనంత వెనక్కు ఉండేలా చూడాలి. ఈ స్థితిలో తలపైకెత్తాలి. కొన్ని సెకనలు ఈ స్థితిలో ఉండాలి. 
 
మెల్లగా గాలి వదులుతూ అదే విధంగా ఎడమ కాలిని వెనక్కు తీసుకురావాలి. పాదాలు రెండూ పక్కపక్కన ఉండేలా చూడాలి. భజాలు చక్కగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు శరీరం బాణం విల్లు ఆకారంలో ఉంటుంది.
 
మెల్లగా గాలి వదులుతూ శరీరాన్ని నేలను తాకించాలి. మోకాళ్లు, అరచేతులు, ఛాతీ, నుదురు నేలను తాకుతూ ఉండాలి. అప్పుడు గాలిని మెల్లగా వదిలివేయాలి. 
 
మళ్లీ మెల్లగా గాలి పీల్చుకుంటూ తలను వీలైనంత వెనుకకు వంచాలి. దాదాపు నడుము వరకూ శరీరాన్ని వెనక్కు వంచాలి. దీనిని భుజంగాసనం అంటారు. 
 
మెల్లగా గాలి వదులుతూ తుంటి, తలను భుజాలతో సమాంతరంగా ఉండేలా పైకి తీసుకురావాలి. ఇప్పుడు మళ్ళీ పైభాగానికి విల్లులా కనిపిస్తుంది. 
 
మెల్లగా గాలి పీల్చుకుంటూ కుడికాలిని ముందుకు తీసుకురావాలి. చేతులు సమాంతరంగా ఉంచుతూ తలపైకెత్తాలి. మెల్లగా గాలిబయటకు వదులుతూ కుడికాలును కూడా ఇదేవిధంగా ముందుకు తీసుకురావాలి. పాదాలు, చేతులను సమాంతరంగా తీసుకువస్తూ తల మోకాళ్ళను తాకేలా చూడాలి. 
 
మెల్లగా గాలి వదులుతూ భుజాలను పైకి లేపాలి. మెల్లగా తల వెనుకకు వంచాలి. తిరిగి నమస్కార స్థితిలోకి రావాలి. తరువాత మొదటి స్థితికి చేరుకోవాలి. ఇంతటితో ఒక రౌండ్ పూర్తవుతుంది. తిరిగి ఈ ఆసనాన్ని మళ్ళీ వేయాలి. 
 
జాగ్రత్తలు 
తుంటి జారినవారు, వెన్ను నొప్పి ఉన్నవారు ఈ ఆసనాలు వేయకపోవడం మంచిది. వారు ఒకవేళ ఆసనాన్ని వేయాలనుకుంటే వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది. 
 
ఉపయోగాలు 
జీర్ణావయవాలు ఉత్తేజితమవుతాయి. చాలా చురుకుగా పనిచేస్తాయి. ఫలితంగా జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. చర్మంలో ఉన్న అసమానతలు, సమస్యలు తొలగిపోతాయి. చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది. వెన్నెముకకు మరింత మేలు జరుగుతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments