Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్య సంజీవని ‘యోగా’... యోగా ప్రాముఖ్యత ఏంటో తెలుసా...?

ఆరోగ్యం అంటే అందరూ శరీరానికి సంబంధించినదని అనుకుంటారు. కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనస్సులో ఉంటాయి. మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్న చోట వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు. మనం రకరకాల

Webdunia
సోమవారం, 20 జూన్ 2016 (20:04 IST)
ఆరోగ్యం అంటే అందరూ శరీరానికి సంబంధించినదని అనుకుంటారు. కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనస్సులో ఉంటాయి. మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్న చోట వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు. మనం రకరకాల వ్యాయామాలు చెయ్యొచ్చు. పుష్టినిచ్చే ఆహారం తీసుకోవచ్చు. మందులు వేసుకోవచ్చు. ఎన్ని చేసినా ఇవన్నీ శరీరాన్ని తప్పించి మనసును తాకలేవు. 
 
మనసును కూడా స్పర్శించి, శరీరాన్ని – మనస్సును బ్యాలెన్స్ చేసే శక్తి ఒక్క యోగాభ్యాసానికి మాత్రమే ఉంది. శరీరాన్ని, మనస్సును ఒక గాడిలో పెట్టి, రెండింటిని సమతుల్యంలోకి తెచ్చేదే యోగ. యోగాకున్న సమగ్రత, సంపూర్ణత్వం మరే ఇతర సాధారణ వ్యాయామాలకు ఉండదు. శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలున్నందునే పాశ్చాత్య ప్రపంచం కూడా ఇప్పుడు యోగా పట్ల ఆకర్షితులవుతున్నారు.
 
యోగాసనాల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం నుండి విషతుల్యాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి. అవయవాల పనితీరు బాగుంటుంది. మనసును శ్వాస ప్రక్రియపై లగ్నం చేసి, ఏకాగ్రత సాధన చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యము పెరుగుతుంది. నానా రకాల ఒత్తిళ్లలో కూరుకుపోతున్న నేటి తరానికి యోగా అత్యంత ఆవశ్యకంగా మారింది. 
 
యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో, మానసిక బలంతో నిత్యం యవ్వనంగా జీవించవచ్చు. రోజు కొద్దిసేపు యోగా చేస్తే ఆసుపత్రికి పరుగు తీయాల్సిన అవసరం ఉండదు. ప్రపంచంలోని అనేక దేశాలు యోగా సాధన పట్ల ఆసక్తి చూపుతుంటే, మన దేశంలోని ఉన్న కొందరు యోగాను మతంతో ముడిపెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. యోగా ఒక మతానికి సంబంధించినది కాదు ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే సంబంధించిన ప్రక్రియ అనే విషయాన్ని గుర్తించాలి.

ముళ్లపందిని వేటాడబోయే మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments