Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయిని ఎందుకు తినాలి?

సాధారణంగా చాలామంది పిల్లలు చాక్లెట్లు, ఐస్ క్రీం లాంటివి తినటానికి ఇష్టపడతారు. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరము. వీటివల్ల తరచుగా జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తూ ఉంటాయి. కనుక పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి పండ్లను తినటం అలవాటు చేయాలి. ఏ సీజన్‌లో దొర

Webdunia
సోమవారం, 19 మార్చి 2018 (16:26 IST)
సాధారణంగా చాలామంది పిల్లలు చాక్లెట్లు, ఐస్ క్రీం లాంటివి తినటానికి ఇష్టపడతారు. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరము. వీటివల్ల తరచుగా జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తూ ఉంటాయి. కనుక పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి పండ్లను తినటం అలవాటు చేయాలి. ఏ సీజన్‌లో దొరికే పండును ఆ సీజన్లో పిల్లలకు పెట్టడం వల్ల వారికి అన్ని రకాల విటమిన్స్ అందుతాయి. దీనివలన పిల్లలు చదువులోను, ఆట పాటలలోను ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. మరి ముఖ్యంగా బొప్పాయిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.
 
అవి ఏమిటంటే.. బొప్పాయి పండు ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికీ గృహవైద్యంగా పని చేస్తుంది. ఎలా అంటే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు భారీగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రోటీన్లను జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైము బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల భోజనం తర్వాత నాలుగు బొప్పాయి ముక్కలు తింటే అది కడుపులో ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూస్తుంది. ఇది మాంసాన్ని కూడా త్వరగా అరిగేలా చేస్తుంది. బొప్పాయిలో ఎ, బి, సి, ఇ విటమిన్లతో పాటు ఖనిజాలు, ప్లేవనాయిడ్స్ వంటి మరెన్నో పోషకాలు ఉంటాయి. 
 
కొలెస్ట్రాల్‌ని తగ్గించడం ద్వారా ఇది గుండె జబ్బులను నివారిస్తుంది. ఇది నరాల బలహీనతలను తగ్గించే మంచి టానిక్ కూడా. క్యాల్షియం, పాస్ఫరస్ ఐరన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, గంధకం, క్లోరిన్ వంటి పోషకాలు తగు మోతాదులో ఉండటం వల్ల బొప్పాయి పలు శారీరక రుగ్మతలకు అడ్డుకట్ట వేయగలుగుతుంది. కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఎ, ఇలు కూడా బొప్పాయిలో ఉంటాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments