Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపిల్‌ను రోజూ తినండి.. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోండి..

రోజూ ఓ ఆపిల్‌ను తీసుకోండి. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆపిల్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించడమే కానీ, గుండెకు హాని కలగకుండా కాపాడుతుంది.

Webdunia
ఆదివారం, 18 మార్చి 2018 (16:04 IST)
రోజూ ఓ ఆపిల్‌ను తీసుకోండి. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆపిల్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించడమే కానీ, గుండెకు హాని కలగకుండా కాపాడుతుంది. ముఖ్యంగా ఈ ఆపిల్‌లో ''పెక్టిన్'' అనే పదార్థం పుష్కలంగా కలిగి వుంది. ఇది శరీరంలోని కొవ్వు పదార్థాలను తొలగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. 
 
అలాగే ఆపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల మెదడుకు సంబంధించిన వ్యాధులను అరికడుతుంది. ఆపిల్ ఉన్న ఫైటో కెమికల్స్ పదార్థాలు శ్వాస సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. ఆపిల్ ‌రోజూ తీసుకుంటే ఆస్తమాని జయించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
ఇకపోతే, ఆపిల్ తినడం ద్వారా అల్జీమర్స్, మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు. క్వెర్సెటీవ్ అనే ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్ యాపిల్‌లో పుష్కలంగా ఉండటం ద్వారా నాడీ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. తద్వారా బ్రెయిన్ సెల్స్ దెబ్బతినకుండా తోడ్పడుతుంది. ముఖ్యంగా మధుమేహం వస్తుందనే భయంతో పండ్లను తినడం మానేస్తుంటారు.
 
ఆపిల్ పండును మాత్రం తప్పక తినాలి. తగిన మోతాదులో ఆపిల్ పండును తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయి నియంత్రించబడుతుంది. దీంతో మధుమేహాన్ని కూడా నియంత్రించుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

తర్వాతి కథనం
Show comments