Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటర్ బాటిల్స్ కొంటున్నారా? ఇక వద్దే వద్దు.. ఎందుకు?

ఇంటి నుంచి వాటర్ బాటిల్‌లో నీళ్లు మోసుకెళ్లకుండా.. బయట షాపుల్లో ప్యాక్డ్ వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నారా? అయితే ఇకపై ఆ అలవాటును మార్చేసుకోండి అంటున్నారు.. పరిశోధకులు. ప్యాక్ చేసిన వాటర్‌ సురక్షితం కా

Webdunia
ఆదివారం, 18 మార్చి 2018 (11:31 IST)
ఇంటి నుంచి వాటర్ బాటిల్‌లో నీళ్లు మోసుకెళ్లకుండా.. బయట షాపుల్లో ప్యాక్డ్ వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నారా? అయితే ఇకపై ఆ అలవాటును మార్చేసుకోండి అంటున్నారు.. పరిశోధకులు. ప్యాక్ చేసిన వాటర్‌ సురక్షితం కాదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యాక్ చేసిన డ్రింకింగ్ వాటర్లో కంటికి చిక్కని సూక్ష్మాతి సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు వుంటాయని స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ అధ్యయనంలో వెల్లడి అయ్యింది.
 
అలాగే ప్యాక్ చేసిన డ్రింకింగ్ వాటర్‌లో కార్బన్ అవశేషాలున్నాయని.. బాటిళ్లపై కొన్ని దేశాల్లో సంపూర్ణ నిషేధం విధించారని పరిశోధకులు తేల్చారు. దీంతో భారత్‌తో పాటు ఇండోనేషియా, అమెరికా, చైనా, ఇండోనేషియాకు చెందిన దేశాల్లో బ్రాండెడ్ కంపెనీల వాటర్ బాటిళ్లపై అధ్యయనం చేస్తున్నారు. ఇంకా బయట షాపుల్లో అమ్మే బాటిల్ నీరు కూడా అంత సురక్షితం కాదని అధ్యయనం తేల్చింది. 
 
ఈ అధ్యయనంలో తొమ్మిది దేశాలకు చెందిన 249 వాటర్ బాటిళ్లను పరిశీలించారు. ఈ అధ్యయనం ప్రకారం 90 శాతం వాటర్ బాటిళ్లలో ప్లాస్టిక్ రేణువులు వున్నట్లు తేలిందని పరిశోధకులు తెలిపారు. భారత్, చైనా, అమెరికా,  ఇండోనేసియా, కెన్యా, లెబనాన్, మెక్సికో, థాయ్‌లాండ్‌ల్లోని అత్యుత్తమ బ్రాండ్లకు చెందిన ప్యాకేజ్డ్ వాటర్‌ బాటిళ్లను పరిశోధకులు పరీక్షించి, నీటి నాణ్యతను విశ్లేషించారు.  
 
లీటరు నీటిలో పది సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ఉండటాన్ని వారు గుర్తించారు. ఈ ప్లాస్టిక్ రేణువులున్న నీటిని తాగితే విరేచనాలు, థైరాయిడ్ వంటి రుగ్మతలు తలెత్తుతాయని పరిశోధకులు తెలిపారు. ఈ నీటిని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తాగకూడదని.. ఒకవేళ తాగితే బరువు తక్కువున్న శిశువులు పుడతారని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments