కరోనావైరస్ నుంచి పసుపు మనకు రక్షణ కల్పిస్తుంది, అదెలాగంటే? (Video)

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (13:17 IST)
భారతీయ సంస్కృతిలో శుభప్రదంగా, మంగళకరంగా భావించే వాటిల్లో పసుపు అత్యంత ప్రధానమైనది. అంతేకాక దీన్ని ఆహారంలో రంగు, రుచి, వాసన కొరకు వాడటంతో పాటు పూర్వకాలం నుండి పసుపును ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ప్రతి ఇంటి గడపలకు పసుపు రాయడం ఆచారం.
 
ఇలా చేయడం ద్వారా క్రిములు, కీటకాలు లాంటివి ఇంటిలోకి ప్రవేశించవనే అభిప్రాయం ఆ ఆచారం వెనుక దాగి ఉన్న వైజ్ఞానిక సత్యం. ఇంటిలోను, బావులు మొదలగు తేమ ప్రాంతాల్లో పని చేసే స్త్రీల పాదాలకు క్రిములు సంక్రమించకుండా పసుపు రాసుకునేవారు. మరలా మన పూర్వ సంప్రాదాయాలను గుర్తు తెచ్చుకునే పరిస్థుతులు ఏర్పడ్డాయి. కరోనావైరస్ నుంచి కూడా పసుపు మనకు రక్షణ కల్పిస్తుంది.
 
అది ఎలాగో తెలుసుకుందాం...
 
1. వేపాకు, పసుపు నీటిలో కలిపి బాగా మరగనివ్వాలి. ఆనీటిని ఇంటి చుట్టూ చల్లుకోవాలి. మనం ఎక్కువగా శానిటైజర్లు వాడవలసి పరిస్థితులు వచ్చాయి. ఇవి పడని వారికి అరచేతులు మంటలు వస్తాయి. అలాంటి వారు ఈ నీటిని ఉపయోగించుకోవాలి.
 
2. గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపు పొడి, కొంచెం మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని వేడి చేసి ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగడం వల్ల జలుబు, తుమ్ములు, దగ్గు లాంటివి నివారింపబడతాయి.
 
3. పసుపు, ఉసిరిక చూర్ణం ఈ రెండింటిని రెండు గ్రాముల చొప్పున తీసుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.
 
4. ఇస్నోఫిలియా వ్యాధికి విరుగుడు చెపుతుంది పసుపు. అరచెంచా పసుపులో మూడు చెంచాల స్వచ్ఛమైన తేనె వేసి రోజుకి మూడుసార్లు చొప్పున నాలుగు నెలల పాటు తీసుకుంటే ఆ వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
 
5. ముక్కలుగా కొట్టిన పసుపుకొమ్ములు, గోధుమలు సమంగా తీసుకుని దోరగా వేయించి దంచిన చూర్ణాన్ని జల్లించి ఉంచుకుని, రోజూ మూడుపూటలా ఆహారానికి అర్థగంట ముందు పావు స్పూను పొడిని అర గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి తాగడం వల్ల ఉబ్బసం వ్యాధి నియంత్రణలో ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గుతుంది. అంతేకాకుండా తుమ్ములు, జలుబు 
తగ్గుతాయి.
 
6. పైన చెప్పిన వాటిని పాటించడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధిక శక్తి పెరగటం వలన కరోనావైరస్ మనకు దూరంగా ఉంటుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chain snatching: హన్మకొండలో చైన్ స్నాచింగ్ కేసు.. వీడియో వైరల్

వేసవిలో మండే ఎండలు.. క్యూలైన్లలో ప్రజలు నిలవొద్దు.. ఒకే నెలలో 3నెలల రేషన్

శాసనమండలిలో స్వల్ప అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ

యువతికి హోలీ రంగులు పూసి మత్తుపానీయం త్రాగించి తోటలోకి తీసుకెళ్లి...

బొత్స సత్యనారాయణ గారు నమస్కారం.. నారా లోకేష్ ఆత్మీయ పలకరింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా

Ranveer Singh: ధురంధర్ ది రివెంజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సింగపూర్‌కు చేరుకున్న డిస్నీ అడ్వెంచర్

తర్వాతి కథనం
Show comments