Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి.. మాగిన అరటి పండును?

సాంకేతిక పరికరాల పుణ్యంతో ప్రస్తుతం నిద్రలేమి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేయడం.. రాత్రి ఇంటికెళ్లాక స్మార్ట్ ఫోన్లతో సహవాసం చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీం

Webdunia
గురువారం, 27 జులై 2017 (12:59 IST)
సాంకేతిక పరికరాల పుణ్యంతో ప్రస్తుతం నిద్రలేమి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేయడం.. రాత్రి ఇంటికెళ్లాక స్మార్ట్ ఫోన్లతో సహవాసం చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అలాంటి వారు ఈ చిట్కాలు పాటించినట్లైతే.. హాయిగా నిద్రపోతారు. చురుకుగా ఉండగలుగుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
బాగా మాగిన అరటిపండు నిద్రకు ఎంతగానో ఉపకరిస్తుంది. అరటిలోని పొటాషియం కండరాలకు స్వస్తత కలిగిస్తుంది. విటమిన్‌ బి6, శరీరంలోని మెలటోనిన్‌ లెవెల్స్‌ను పెంచుతుంది. దీంతో నిద్రలేమి సమస్య తొలగిపోతుంది. అందుకే ముప్పై దాటిన వారు రోజూ రాత్రి పూట ఒక అరటి పండు తినడం మంచిది. అదేవిధంగా స్వీట్‌ పొటాటోలలో అత్యధిక ప్రొటీన్లు ఉంటాయి. ఈ ప్రొటీన్లు కండరాలను రిలాక్స్‌గా ఉంచుతాయి. మనిషికి కావాల్సినంత నిద్రను అందించే గుణం స్వీట్‌ పొటాటోలో పుష్కలంగా వుంది. 
 
నిద్రలేమితో బాధపడేవారు నిద్రకు ఉపక్రమించేటప్పుడు మధ్యాహ్నం పూట ఉడికించిన పెసలు తినడం మంచిది. ఇందులో విటమిన్ బి నరాల వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. తద్వారా చక్కటి నిద్ర పడుతుంది. రోజూ తాగే పాలు, గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీలలోకి రెండు చుక్కలు తేనె వేసుకోవడం ద్వారా హాయిగా నిద్రపోవచ్చు. తేనెలోని తీయదనం గ్లూకోజ్‌ను ప్రేరేపిస్తుంది. అప్పుడు నిద్ర పట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments