Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎముకలు దృఢంగా వుండాలంటే ఈ ఫుడ్ తీసుకోవాల్సిందే....

ఈ రోజులలో చాలా మందికి కాల్షియం లోపించడం వల్ల ఎముకలు బలహీనంగా ఉండి అనేక రకములైన నొప్పులతో బాధ పడుతూఉన్నారు. దీనికి కారణం మనం తీసుకునే ఆహారంలో సరియైన పోషకాలు లేకపోవటమే. ముఖ్యంగా చిన్నచిన్న ప్రమాదాలకే ఎముకలు విరుగుతున్నాయి. ఎముకలు బలంగా, పటిష్టంగా ఉండాల

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (19:42 IST)
ఈ రోజులలో చాలా మందికి కాల్షియం లోపించడం వల్ల ఎముకలు బలహీనంగా ఉండి అనేక రకములైన నొప్పులతో బాధ పడుతూఉన్నారు. దీనికి కారణం మనం తీసుకునే ఆహారంలో సరియైన పోషకాలు లేకపోవటమే. ముఖ్యంగా చిన్నచిన్న ప్రమాదాలకే ఎముకలు విరుగుతున్నాయి. ఎముకలు బలంగా, పటిష్టంగా ఉండాలంటే కాల్షియం ఎక్కువుగా ఉన్న ఆహార పదార్ధాలను, పాల ఉత్పత్తులను తప్పనిసరిగా రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి.  అవి ఏంటో చూద్దాం.
 
1. ప్రతిరోజూ తాటిబెల్లాన్ని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. అంతేకాకుండా రక్తహీనత సమస్య తగ్గుతుంది.  కాళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు తాటిబెల్లం, కొద్దిగా అల్లం కలిపి తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
 
2. పాలు, పెరుగులో కాల్షియం శాతం ఎక్కువుగా ఉంటుంది. దీనిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పాలల్లో పంచదారకు బదులు బెల్లాన్ని కలుపుకుని తాగడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది.
 
3. రాగి పిండిని జావాలా చేసి దానిలో తగినంత తాటిబెల్లం వేసుకుని ప్రతి రోజు త్రాగటం వలన దానిలో ఉన్న పోషకాలు జ్ఞాపకశక్తిని పెంచి, పిల్లలలో ఎముకల పెరుగుదలకు కావలసిన కాల్షియంను అందిస్తాయి.
 
4. పాలకూర, తోటకూర, బచ్చలికూర లాంటి ఆకుకూరల్లో డి విటమిన్, కాల్షియం ఎక్కువుగా ఉండి అది ఎముకలను పటిష్టంగా ఉంచుతుంది. కనుక వారంలో మూడుసార్లయిన ఆకుకూరలను తినటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. 
 
5. యాలుకలలో పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో చిటికెడు యాలుకల పొడిని వేసుకొని ప్రతిరోజు త్రాగటం వలన ఎముకలు ధృడంగా తయారవుతాయి.
 
6. అంజీర పండ్లను, నారింజ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. దీనిలో ఉన్న కాల్షియం రోగనిరోధక శక్తిని పెంచటమే కాకుండా ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది.
 
7. ప్రతిరోజూ ఉడకబెట్టిన కోడిగుడ్డు తినడం వల్ల మన శరీరంలో కాల్షియం శాతం పెరిగి ఎముకలు బలంగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

తర్వాతి కథనం
Show comments