Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింతచిగురును వాటిలో కలిపి పేస్టులా చేసి దాన్ని అక్కడ రాసుకుంటే?

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (21:35 IST)
చింతచిగురు పప్పుతో కూర చేసుకుని అన్నంలో కలుపుకుని తినడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాకుండా మనకు తృప్తి కలుగుతుంది. చింతచిగురు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు.
 
చింతచిగురు పప్పులో వాడడం వల్ల ఎన్నో రోగాలు నయం అవుతాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. బెణుకులకు, పాత నొప్పులకు చింత చిగురు దివ్యౌషధంలా పనిచేస్తుందట. చింతచిగురును బెల్లంతో నూరి నొప్పులున్న చోట పట్టువేసినట్లయితే నొప్పులు తగ్గిపోతాయట. రక్తహీనత సమయంలో చింతచిగురు వంటలు ఇంగ్లీష్ మందుల్లా పనిచేస్తాయట. చింతచిగురు కూర కీళ్ళ నొప్పుల నివారణకు ఎంతగానో పనిచేస్తుందట.
 
చింతచిగురును కొబ్బరిపాలలో కలిపి బాగా నూరి దానిలో పసుపు, పచ్చ, కర్పూరాన్ని కలుపుకుని పేస్ట్‌గా మారేవరకూ కలిపి, ఆ పేస్టును ఓ ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరుచుకుని ముఖంపైన మొటిమలు గాని, మచ్చలు గానీ ఉన్నట్లయితే ఆ పేస్టును ముఖానికి పూసి అరగంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలట. 
 
ఇలా చేస్తే ముఖం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా తయారవుతుందట. ఇలా పది, పదిహేనురోజులు చేసినట్లయితే ముఖంపై మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయట.

సంబంధిత వార్తలు

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments