మీసం, గెడ్డం మగతనానికి చిహ్నం. ఆడ, మగల మధ్య తేడాగా యవ్వన ప్రారంభం నుంచి వచ్చే కొత్త లక్షణాలు ఇవి. సహజంగా పెరిగేది అయినా సమాజంలో సాంస్కృతికంగా గడ్డానికి పలు రకాల అర్థాలను ఏర్పరచుకున్నారు. గడ్డం కొందరికి మగతనపు చిహ్నంగా కనిపిస్తుంది. కవులు, గాయకులు పలు రంగాల మేధావుల గడ్డం పెంచడం వల్ల గడ్డం మేధో సంపత్తికి చిహ్నమైంది.
కాలంతో వచ్చిన మార్పులలో గడ్డం మిగిలిన ఇతర అంశాలకు సంకేతం కోల్పోయి అది ఫ్యాషన్‌లో భాగంగా తయారైంది. ఇప్పుడు సినీ హీరోలందరూ గడ్డంతో కనిపిస్తున్నారు. వారిని చూసి నేటి యువత గడ్డం పెంచుతోంది. అయితే ముఖానికి తగిన గడ్డం పెంచుకోవడంతో పాటు అందంగా తీర్చిదిద్దుకోవడం కూడా ముఖ్యమట.
ప్రతి రెండు రోజులకు ఒకసారి తప్పకుండా గడ్డాన్ని సబ్బుతో, షాంపూతో శుభ్రం చేయాలట. ఇలా చెయ్యడం వల్ల గడ్డంలో పేరుకున్న మురికి జిడ్డు తొలగిపోతాయట. గడ్డపు రోమాలు మెత్తగా ఉంటాయట. దురద రాకుండా, కురుపులు రాకుండా ఉంటాయట. నాణ్యమైన షాంపు ఎంచుకోవాలట. ఆ షాంపూలో సల్ఫేట్స్ లేకుండా ఉండడం అవసరం.
అలాగే గడ్డానికి చక్కని రూపం ఇవ్వడానికి వాక్సింగ్ చెయ్యటం అవసరమట. అప్పుడే గడ్డం నిలిచి వాక్సింగ్ తో కనిపిస్తుందట. గడ్డం మెత్తగా ఉన్నప్పుడు వాక్సింగ్ చేయాలట. అలాగే ఒక్కొక్క ముఖానికి ఒకలాంటి గడ్డం అందంగా కనిపిస్తుంది. గడ్డం పెంచగానే సరిపోదని..దానిని జాగ్రత్తగా కూడా ట్రిమ్ చేసుకోవాలట. మెడభాగంలో అయితే ట్రిమ్మర్ ఖచ్చితంగా వాడాలట. వారంలో రెండురోజులు ట్రిమ్మర్ ఖచ్చితంగా చేయాలి.