Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలా? పొన్నగంటి కూర తినండి.. ఉల్లికాడలతో గుండెజబ్బులు?

ఆకుకూరలతో కంటిచూపు మెరుగవుతుంది. మధుమేహం దూరమవుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ కప్పు మోతాదులో ఆకుకూరలను తీసుకోవడం ద్వారా శరీర పెరుగుదలకు, దృఢత్వానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. పాలకూర, గోంగూర, తోట

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (12:56 IST)
ఆకుకూరలతో కంటిచూపు మెరుగవుతుంది. మధుమేహం దూరమవుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ కప్పు మోతాదులో ఆకుకూరలను తీసుకోవడం ద్వారా శరీర పెరుగుదలకు, దృఢత్వానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. పాలకూర, గోంగూర, తోటకూర, మెంతికూర, బచ్చలికూర, పుదీనా, మునగాకు వంటివి ఆహారంలో చేర్చుకుంటూ వుండాలి. వీటిలో ఐరన్, విటమిన్ ఎ, సి పుష్కలంగా వుంటుంది. ఇంకా ఆకుకూరల్లోని కెరోటిన్ విటమిన్ సిగా మారి.. కంటి చూపు తగ్గడాన్ని నిరోధిస్తుంది. ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది. మధుమేహాన్ని దూరం చేస్తుంది. 
 
గోంగూరను వారంలో రెండుసార్లు తీసుకోవడం ద్వారా కంటిచూపు మెరుగవుతుంది. దగ్గు, ఆయాసంతో బాధపడేవారికి, రేచీకటిని ఇది తొలగిస్తుంది. బరువును తగ్గించుకోవాలంటే పొన్నగంటికూర తీసుకోవడం మంచిది. పొన్నగంటి కూరలో కొలెస్ట్రాల్ తక్కువ. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది. ఆకుకూరలతో పాటు ఉల్లికాడలను వారానాకి ఓ రోజు ఆహారంలో చేర్చుకుంటే.. గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. రక్తపోటు, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతాయి.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments