Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ధనియాలు తీసుకుంటే కలిగే మేలు ఏమిటి?

ధనియాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం. 1. నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయం చేసుకొని… ఆ కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. 2. ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకొని చిన్నచిన్న గుళికల్లా చేసుకొని మూడు

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (16:10 IST)
ధనియాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం.
 
1. నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయం చేసుకొని… ఆ కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది.
2. ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకొని చిన్నచిన్న గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పుల నుంచి విముక్తి కలుగుతుంది.
3. గర్భవతులు రోజూ తమ ఆహారంలో విధిగా ధనియాలు తీసుకోవడం వల్ల ముఖ్యంగా ప్రసవించిన సమయంలో గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.
4. అజీర్తి, పుల్లత్రేపులు, కడుపుబ్బరం గలవారికి ధనియాలు శుభ్రం చేసి తగు ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి రోజూ ఆ పొడి వాడుతూంటే నివారణ కల్గుతుంది.
5. కడుపులో మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, గడబిడ, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే తగ్గిపోతుంది.
6. బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే  పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం మటుమాయమవుతుంది.
7. వేసవిలో విపరీతమైన దాహం ఉంటుందిగానీ ఆకలి తక్కువ. ఉదయాన్నే ధనియాలు తీసేసిన ఆ నీటిలో చక్కెర, పచ్చకర్పూరం వేసుకుని తాగితే శరీరానికి మంచిది.
8 షుగర్, బీపీలను కంట్రోల్‌లో ఉంచుతుంది. 
9. ధనియాలు రోజూ తీసుకోవడం వల్ల చిన్న పిల్లలతో పాటు.. స్త్రీలకు ఎక్కువగా మేలు చేస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments