Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయు కాలుష్యంతో హృద్రోగాలు...

చెట్లు కొట్టేయడం, మనుషులు కన్నా వాహనాలు ఎక్కువ కావడం, ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న రసాయనాలు.... వంటి వాటి కారణంగా వాయు కాలుష్యం పెరిగిపోతున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ఇంతకాలం అనుకున్నట్లు వాయు కాలుష్యం వల్ల కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (21:57 IST)
చెట్లు కొట్టేయడం, మనుషులు కన్నా వాహనాలు ఎక్కువ కావడం, ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న రసాయనాలు.... వంటి వాటి కారణంగా వాయు కాలుష్యం పెరిగిపోతున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ఇంతకాలం అనుకున్నట్లు వాయు కాలుష్యం వల్ల కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలే కాకుండా, హృద్రోగ సమస్యలూ వస్తున్నాయని అమెరికన్ పరిశోధకులు పేర్కొంటున్నారు.
 
ముఖ్యంగా రక్తంలో చక్కెర శాతంతో పాటు కొలస్ట్రాల్ పెరగడానికి తద్వారా హృద్రోగ మరణాలకు దారితీస్తుందని అమెరికన్ పరిశోధకులు పేర్కొంటున్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందట. ఇందుకోసం దక్షిణ ఇజ్రాయెల్‌లో వాయుకాలుష్యానికి గురవుతున్న కొందరు వ్యక్తుల మీద ఈ ప్రభావాన్ని లెక్కించారట. 
 
గాలిలో ఏరోసల్స్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నివసించే వాళ్ల రక్త నమూనాలను పదేళ్లపాటు నిరంతరాయంగా సేకరించి పరిశీలించారట. వాటిల్లో రక్తంలో చెడు కొలస్ట్రాల్ బాగా పెరగడంతో పాటు మంచి కొలస్ట్రాల్ తగ్గిందట. అంతేకాదు, సాధారణ వ్యక్తులతో పోలిస్తే చక్కెర రోగుల్లో చెడు కొలస్ట్రాల్ చాలా ఎక్కువగా పెరిగినట్లు గుర్తించారు. దీన్నిబట్టి వాయుకాలుష్యం వల్ల హృద్రోగాలు పెరుగుతున్నాయని వాళ్లు విశ్లేషిస్తున్నారు. కాబట్టి మనచుట్టూ ఉన్న గాలిమీద ఓ కన్ను వేయాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

తర్వాతి కథనం
Show comments