Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగులో పంచదార కలుపుకుని తింటే...

ఏ కాలంలోనైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా చాలామంది ఇష్టంగా తినే పదార్థం పెరుగు. అయితే పెరుగు తినడానికి ఇష్టపడనివారు కొందరు ఉంటారు. అలా కాకుండా పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుని, వాటిని దృ

Webdunia
మంగళవారం, 27 మార్చి 2018 (19:03 IST)
ఏ కాలంలోనైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా చాలామంది ఇష్టంగా తినే పదార్థం పెరుగు. అయితే పెరుగు తినడానికి ఇష్టపడనివారు కొందరు ఉంటారు. అలా కాకుండా పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుని, వాటిని దృష్టిలో ఉంచుకుని పిల్లులూపెద్దలూ అందరూ తీసుకోవలసిన ఆహార పదార్థం పెరుగు. దీనిలో శారీరక రుగ్మతలను తగ్గించే గుణం మెండుగా ఉంది. అవేంటో చూద్దాం.
 
1. జలుబుతో బాధపడేవారు పెరుగులో మిరియాల పొడిని, బెల్లం పొడిని కలిపి తింటే ఉపశమనం కలుగుతుంది. 
 
2. పెరుగు తినడానికి ఇష్టపడనివారు మజ్జిగ చేసి దాంట్లో నిమ్మరసం, కొంచెం ఉప్పు, జీలకర్ర పొడి వేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
 
3. వేడి అన్నంలో పెరుగు కలుపుకని తింటే విరేచనాలు తగ్గుతాయి. పెరుగులో కొంచెం మెంతులు కలుపుకుని తింటే జిగట విరేచనాలు తగ్గుతాయి.
 
4. పెరుగుకు వాతాన్ని హరించే శక్తి ఉంది. పెరుగులో ఉప్పు కలుపుకుని తింటే అజీర్తి వ్యాధి తగ్గుతుంది. 
 
5. వంటికి నీరు పట్టినవారు పెరుగు ఎక్కువగా తినాలి. కఫాన్ని త్వరగా తగ్గించే గుణం పెరుగుకు ఉంది.
 
6. పెరుగులో పంచదార కలుపుకుని తింటే అధిక వేడి చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. మతిమరుపు తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పెరుగు పదార్థాలు తింటే వేడి శరీరం వారికి మంచిది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే శక్తి మెరుగవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తర్వాతి కథనం
Show comments