Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండె పదిలంగా ఉండాలనుకోవారికి స్ట్రాబెరీ..

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (11:49 IST)
ఎరుపు రంగులో, హృదయాకారంలో ఉండే స్ట్రాబెర్రీ పోషకాల నిధి. అందుకే వీటిని ఫ్రూట్ సలాడ్స్‌‌లో, ఐస్‌‌క్రీమ్‌‌ల తయారీలో విరివిగా వాడతారు. ఎక్కువ పీచు, తక్కువ క్యాలరీలతో నిండిన ఈ పండును ఆరోగ్యసిరి అనొచ్చు. స్ట్రాబెర్రీ వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో తెలుసుకుందా.
 
*స్ట్రాబెర్రీలలో సి, కె వంటి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
 
*దీనిలోని పొటాషియం, మెగ్నీషియం హైపర్‌‌టెన్షన్‌ను తగ్గిస్తాయి. హృదయ కండరాలు గట్టిపడడాన్ని అడ్డుకుంటాయి. దాంతో శరీర భాగాలకు రక్త సరఫరా సవ్యంగా జరుగుతుంది.
 
*ఈ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారించి, గుండె పోటు ప్రమాదం నుంచి కాపాడతాయి. 
 
*బరువు తగ్గాలనుకునే వారికి స్ట్రాబెర్రీ మంచి ఛాయిస్. ఎందుకంటే దీనిలో కొవ్వును కరిగించే లెప్టిన్, అడిపోనెక్టిన్ వంటి హార్మోన్లు ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి, రక్తంలో చక్కెర శాతం పెరగకుండా చూసి, బరువు తగ్గడంలో తోడ్పడతాయి.
 
*గర్భిణులు ఈ పండు తింటే వారికి అవసరమైన ఫోలిక్ ఆమ్లం లభిస్తుంది. ఇది పుట్టబోయే బిడ్డలో లోపాలు ఏర్పడకుండా చూస్తుంది.
 
*స్ట్రాబెర్రీలో యాంటి ఆక్సిడెంట్లు రక్తనాళాలను రిలాక్స్ చేస్తాయి. రక్తపీడనాన్నితగ్గించి, గుండె సంబంధ వ్యాధుల్ని నివారిస్తాయి.
 
*కళ్ల మీద స్ట్రాబెర్రీ ముక్కలను పదినిమిషాల పాటు ఉంచితే, కళ్ల కింద వలయాలు తగ్గిపోతాయి.

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments