Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీరు వాడే టూత్ పేస్ట్ సరైనదేనా అని తెలుసుకోవటం ఎలా? (video)

మీరు వాడే టూత్ పేస్ట్ సరైనదేనా అని తెలుసుకోవటం ఎలా? (video)
, శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (10:12 IST)
నవ్వుకు దంతాలు మరింత అందాన్నిస్తాయి. దంతాల పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలం. దేశంలోని ప్రజలు దాదాపు 51 శాతం మాత్రమే టూత్ పేస్టు, టూత్ బ్రష్‌ను వాడుతున్నారంటే నమ్మబుద్ధి కావట్లేదు కదూ... అందునా భారతదేశంలో నివసించే ప్రజల్లో దంత సమస్యలపై లేదా దంతాలను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం దంతాలపై అవగాహన లేకపోవడమేనంటున్నారు వైద్యులు. 
 
దేశంలోని కేవలం 19 శాతం మంది ప్రజలు మాత్రమే ఉదయం, రాత్రి రెండు పూటలా దంతావధానం చేస్తున్నట్లు ఓ సర్వేలో తెలిసింది. అలగే పంటి నొప్పి కలిగినప్పుడు దేశంలోని 82 శాతం మంది ప్రజలు వైద్యుల వద్దకు వెళ్ళి చికిత్స చేసుకునేందుకు వెనుకాడుతున్నారు. అదే నూరు మందిలో కేవలం ముగ్గురు మాత్రమే నిత్యం ప్రతి ఏడాదికి ఒకసారి తమ దంత పరీక్షల కొరకు వైద్యుల వద్దకు వెళుతుంటారని ఆ సర్వే ఫలితాలు వెలువరించింది.
 
టూత్ పౌడర్ లేదా టూత్ పేస్ట్
దంతావధానం చేసేందుకు టూత్ పౌడర్ లేదా టూత్ పేస్ట్ ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి మాత్రమే ఎంచుకోవాలి. ఎందుకంటే వీటిలో ఏదో ఒకదానితోనే బ్రష్ చేయగలుగుతారు. దీంతో దంతావధానం సరిగా చేయగలుగుతారు. ఒకవేళ మీరు టూత్ పౌడర్‌ను వినియోగించాలనుకుంటే ఆ పౌడర్ నున్నగా ఉండేలా చూసుకోండి. 
 
మీరు వాడే టూత్ పేస్ట్ ఎలా ఉండాలంటే...
* ఏదైనా మంచి కంపెనీ లేదా మంచి బ్రాండ్ కలిగిన టూత్ పేస్ట్‌ను ఉపయోగించండి.
* టూత్ పేస్ట రంగు, రుచి, సువాసనకు బదులుగా దాని పనితనమెంతో తెలుసుకోండి. 
* ఆహారం లేదా నీరు తీసుకునే సమయంలో మీ దంతాలకు చల్లగా-వేడిగా అనిపిస్తే మెడికేటెడ్ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించండి. 
 * ఎక్కువ వైటనర్స్ కలిగిన టూత్ పేస్ట్‌ను ఎక్కువకాలంపాటు వాడటం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు దంతవైద్య నిపుణులు. 
 
* ఫ్లోరైడ్‌తో కూడుకున్న టూత్ పేస్ట్‌ను వాడదలచుకుంటే వైద్యుల సలహా మేరకు వాడండి.
* చిన్నపిల్లలకు ఫ్లోరైడ్‌తో కూడుకున్న టూత్ పేస్ట్ ఇవ్వకండి. 
* ఎట్టి పరిస్థితుల్లోను ఏ రకానికి చెందిన టూత్ పేస్ట్‌ను మింగకండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చింతపండు అధికంగా తీసుకునేవారి ఆరోగ్యం ఎలా వుంటుంది?